ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్‌పై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షాలకు తెలియకుండా చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయగలరా అని వ్యాఖ్యానించారు. అమిత్ షా అనుమతితోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కామ్ ల రాజా అని, పాపం పండి నేడు పోలీసులు అరెస్టు చేశారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమే చంద్రబాబును అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారని, వారి ఆరోపణలలో వాస్తవం లేదన్నారు.
చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు చేపట్టాలంటే గత నాలుగేళ్లు పట్టేదా అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే కక్ష సాధింపు చర్యలు చేపట్టే వాళ్లమని ఆయన పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం విచారణకు గంట పాటు లంచ్ టైం ఇచ్చారు. విరామం అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత కోర్టులో విచారణ తిరిగి స్టార్ట్ అవుతుంది. విచారణ జరుగుతున్న సమయంలో చంద్రబాబు కొడుకు లోకేష్ కూడా కోర్టులోనే ఉన్నారు. అయితే వాదనల అనంతరం ఏసీబీ న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అన్నీ ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ చేశారని ఆయన వ్యాఖ్యనించారు. కోర్టు ఏ నిర్ణయంతో.. వాస్తవాలు తెలుస్తాయి.. చంద్రబాబును జైలుకు పంపించాలని టార్గెట్ చేసుంటే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తారు.. చంద్రబాబును అరెస్టు చేయటానికి ఐదేళ్లు ఎదురు చూస్తారా అని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
AP Police Stopped Pawan Kalyan at Garikapadu Checkpost: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇక ఆయన అరెస్టు ఖండించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతుగా ఆయనని కలిసేందుకు విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్ళడానికి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు పవన్ కళ్యాణ్ వెళ్లగా ఆయన వెళ్లే విమాననానికి అనుమతి లేదని అధికారులు వెనక్కి పంపారు. ఈ క్రమంలో…
చంద్రబాబు అరెస్ట్ పై టీటీడీ పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు తెలిసింది వెన్నుపోటు, పన్ను పోటు అని ఆరోపించారు.
జగన్ 16 నెలలు జైల్లో ఉండటం వలన కక్ష సాధింపు చర్యలతో అక్రమ అరెస్ట్ చేయించారని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడుని పది నిమిషాలు అయినా సరే జైల్లో పెట్టాలని ఉద్దేశంతో అరెస్ట్ చేశారని తెలిపారు.