CM Chandrababu Naidu: అకాల వర్షాలు, వడగండ్ల వానల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జంపల్లిలో ఇద్దరు అరటి రైతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ విషయాన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ఇతర అధికారులతో ఈ ఘటనపై సమీక్ష నిర్వహించారు. Read Also: Robinhood Trailer: నితిన్ ‘రాబిన్…
ప్రముఖ సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెలలో అరెస్ట్ అయ్యాడు పోసాని. నిన్న సీఐడీ కోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ, షూరిటీ సమర్పణలో ఆలస్యం కారణంగా విడుదల ప్రక్రియ కొంత జాప్యం అయింది.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు. నేడు ఆయన 125వ జయంతి. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని.. పొట్టి శ్రీరాములును స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. విజయవాడ సామరంగ్ చౌక్ సెంటర్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎంపీ కేశినేని పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు వారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి శ్రీ…
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, వివిధ సంస్థల ప్రతిపాదనలపై చర్చ జరిగింది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) 4వ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో 10 సంస్థలకు సంబంధించి పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో ఇంధన శాఖపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఒకప్పుడు ఉండేదని ఆరోపించారు. తాను పాదయాత్ర చేసినపుడు కొన్ని సంఘటనలు తనను కలిచి వేశాయన్నారు. ప్రస్తుతం 9 గంటలు రైతులకు నిర్విరామంగా కరెంట్ ఇస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు.
పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. కర్నూలు జే ఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేశారు. నిన్ననే పోసాని కస్టడీ పిటిషన్ ను మేజిస్ట్రేట్ డిస్మిస్ చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను దూషించిన కేసులో నిందితుడు పోసాని.. ఈనెల 5వ తేదీ నుంచి కర్నూలు జైలులో ఉన్నారు. ఆదోని త్రీ టౌన్ పీఎస్ లో జనసేన నేత రేణువర్మ…
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక భారతీయులకు రక్షణ లేదని సీపీఐ నేషనల్ సెక్రటరీ నారాయణ అన్నారు. అమెరికాలో తాజా పరిస్థితిపై ఆయన మీడియాతో మాట్లాడారు. "మోడీ వివిధ దేశాల అధినేతలతో సమావేశాలకే పరిమితం అవుతున్నారు.. ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన దేశం గా ఉన్న అమెరికా బెదిరింపులకు దిగడం సరికాదు.. ఇతర దేశాల సంపదను కొల్ల గొట్టేందుకు అమెరికా ప్రయత్నం చేస్తుంది.. ఎలాన్ మాస్క్ తో డిబేట్ సందర్బంగా విధి రౌడీ లాగ ట్రంప్ ప్రవర్తన ఉంది..…
తనకు చంద్రబాబు నాయుడుతో వైరం ఉందని అందరూ అంటుంటారని.. అది నిజమే కానీ ఇప్పుడు కాదని మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, వాటిని మరిచిపోవాలన్నారు. ఎల్లకాలం పరుషంగా ఉండాల్సిన అవసరం లేదని వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. దగ్గుబాటి రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖ గీతం యూనివర్సిటీలో జరిగింది. ఈ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై తోడల్లుళ్లు చంద్రబాబు, వెంకటేశ్వర రావు ఆత్మీయ…
మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో గురువారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తోడల్లుళ్లు చంద్రబాబు, వెంకటేశ్వర రావు దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదిక పైకి వచ్చారు. చంద్రబాబు, దగ్గుబాటి కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా.. ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం మాత్రం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి. ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సందర్భంగా…