Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రెస్ నోట్ ఇటు టాలీవుడ్ అటు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. తెలుగు పరిశ్రమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు అంటూ పవన్ నుంచి వచ్చిన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం అనుసరించబోయే ధోరణి గురించి సవివరంగా చెప్పడం నిర్మాతల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. కూటమి ఏర్పడి ఏడాది అవుతున్నా.. ఇప్పటిదాకా టాలీవుడ్ సంఘాలు, ప్రతినిధులు ఎవరూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కనీసం మర్యాదపూర్వకంగా అయినా కలవకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ ప్రస్తావించిన విషయాలు చాలా సీరియస్ గా ఉన్నాయి.
Read Also: Groom Kidnapped: పెళ్లి వేదికపై కలకలం.. పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేసిన డ్యాన్స్ టీమ్..!
ఇకపై సమస్యలైనా విన్నపాలైనా పర్సనల్ మీట్స్ ఉండవని చెబుతున్న పవన్ కేవలం అసోసియేషన్ల ద్వారా మాత్రం సంప్రదింపులు చేయాలని గట్టిగా చెప్పేశారు. అంటే ఇకపై ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎవరైనా సరే వ్యక్తిగత కారణాల మీద అపాయింట్మెంట్స్ ఉండవన్న క్లియర్ చేసేసారు. థియేటర్ల ఆదాయాలు, పన్నుల రాబడి, వాటిలో సౌకర్యాలు, మల్టీప్లెక్సుల పేరిట జరుగుతున్న వ్యాపారంలోని లొసుగులు, టికెట్ రేట్ల విషయంలో ఏర్పడుతున్న సానుకూలత వ్యతిరేకత ఇలా అన్నింటి పైనా సమీక్షలు, రిపోర్టులు తీయబోతున్నారు. ముఖ్యంగా పరిశ్రమలో గుత్తాధిపత్యం మీద దృష్టి పెడతామని లేఖలో చెప్పడం.. ఇప్పుడీ నోట్ తాలూకు పరిణామాల తీవ్రత ఏ స్థాయిలో ఉండబోతోందోనని అదిరిలో ఓ ప్రశ్నగా మారింది.
Read Also: S**X On Road: బరితెగించిన రాజకీయ నేత.. రోడ్డుమీదే కారు ఆపి పబ్లిక్ గా శృంగారలీలలు..!