పోలీసు వేధింపులకు దేశంలోనే నిలువుటద్దంలా ఏపీ నిలుస్తుందని.. కస్టోడియల్ టార్చర్ కి ఏపీ పోలీస్ స్టేషన్ లు వేదికలుగా మారిపోతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. గతంలో సోనియాతో కలసి జగన్ ను 16 నెలలు జైలులో ఉంచేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు.. లిక్కర్ కేసులో బెయిలుపై బయట తిరుగుతున్న చంద్రబాబు.. లేని లిక్కర్ కేసు సృష్టించారని విమర్శించారు.
READ MORE: Neha Singh Rathore: ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. సింగర్ నేహా సింగ్ రాథోడ్‌పై కేసు..
లిక్కర్ కేసులో మొదట విజయసాయిరెడ్డిని లైన్ లోకి తెచ్చారు.. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళటంతో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెచ్చారు.. ఆ తర్వాత జగన్ పేరు తెస్తారని మాజీ మంత్రి ఆరోపించారు.. ఇసుమంత కూడా బిడియపడకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు.. మరొకరు డబ్బు మొత్తం ఫారిన్ వెళ్ళిపోయాయి అని చెప్తారు.. ఆ తర్వాత ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అంటారు.. ఇప్పుడేమో మిథున్ రెడ్డి అంటున్నారని వ్యాఖ్యానించారు.. రోజుకో కథ వండి వారుస్తున్నారని… లక్షల కోట్ల పేజీల మెమరీ డిలీట్ చేశారని పేపర్లలో రాస్తారని.. జగన్ అరెస్ట్ నుంచి మొదలు పెట్టి కిందకు వస్తారన్నారు.
READ MORE: (no title)
బట్ట కాల్చి ఎదుటి వారిపై వేసే రాజకీయం చేస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. “చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు.. జగన్‌ను కూడా అరెస్ట్ చేయాలి.. చంద్రబాబు పోలీసులకు ధైర్యం చెప్పారని ఓసారి చెప్తారు.. పేపర్ లో వార్త రాస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన రెడ్ బుక్ రాజ్యాంగకర్త.. పీఎస్ఆర్ ఆంజనేయులు పక్కగా విధి నిర్వహణ చేశాను అని నమ్మాడు కాబట్టే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.. జైలులో కూడా ఆయన చంద్రబాబుకు నిత్య పూజలు చేసుకునే వ్యక్తి అని జైలు అధికారులే చెప్పుకుంటున్నారు.. అరెస్ట్ అప్పుడే అన్నీ వెతుకున్నారు కదా.. మళ్ళీ ఇప్పుడు ఎందుకు సోదాలు.. రాజ్యమే ప్రజలను హింసిస్తే ప్రజల ఆగ్రహంలో కొట్టుకుపోతారు.. ఏపీలో తల్లికివందనం జరుగుతుందని ఢిల్లీ మీడియాకు చెబుతున్న చంద్రబాబు.. ఏపీలో ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రారంభించలేదు.” అని విమర్శించారు.
READ MORE: Game Changer: ‘గేమ్ ఛేంజర్’ మొత్తం ఫుటేజీ 7.30 గంటలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఎడిటర్
సొంత పార్టీ నేతలే ప్రజల దగ్గరకు వెళ్లలేక మదన పడుతున్నారని.. ఈ ప్రభుత్వం ఆ ముగ్గురి సంపద సృష్టి కోసం మాత్రమే అని వైసీపీ నేత పేర్ని నాని తెలిపారు.. “చంద్రబాబు ఇంటికి కాయగూరలు కావాలంటే విమానంలో వెళ్ళి తెచ్చుకుంటున్నారు.. జగన్ లాగా నేను అప్పులు చేసి పథకాలు ఇవ్వను.. నేను సంపద సృష్టించి ఇస్తానని చెప్పారు.. సంవత్సరం తిరిగే లోపు లక్షన్నర కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం.. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇంట్ కరెంట్ కోసం యూనిట్ 9 రూపాయలు వసూలు చేస్తున్నారు..” అని ఆరోపించారు.