Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పాలనా పరిస్థితులు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగన్ కౌంటర్లు హాట్ టాపిక్ గా మారాయి. అభివృద్ధి మంత్రం తన చేతిలో ఉందని ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన హామీలను గుర్తు చేసారు. మరింత సంక్షేమం చేస్తామని చెప్పారు. కానీ, 12 నెలలు పూర్తయ్యినా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదు అన్నారు.
Read Also: Jagan Mohan Reddy: అభివృద్ధి ఎక్కడ కనిపించనేలేదు.. సంక్షేమం ఊసే లేదు..!
ఇక రాష్ట్ర వృద్ధి రేటు కేవలం 3.08 శాతమేనని… మరోవైపు, దేశ స్థాయిలో గ్రాస్ టాక్స్ రెవెన్యూ వృద్ధి రేటు 13.76 శాతం ఉందని అన్నారు. ఏపీ ఆదాయం మాత్రం చంద్రబాబు, ఆయన మంత్రుల జేబుల్లోకి వెళ్తోంది అని జగన్ అన్నారు. ఈ ఏడాది మాత్రమే రూ.81,597 కోట్ల అప్పులు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,32,671 కోట్ల అప్పులు తీసుకుంది. ఇందులో సగం అప్పులు ఒక్క ఏడాదిలోనే చేసి పెట్టారు. రాష్ట్ర ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టడమంటే ఇదే కావచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Gemini AI : AI ప్రపంచంలో సరికొత్త రికార్డు.. గూగుల్ జెమినికి 40 కోట్ల యూజర్లు..
అలాగే యాక్సిస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో రూ.11 వేల కోట్ల స్కాం జరిగిందని అన్నారు. మేము 2021లో సెకి సంస్థతో 2.49 రూపాయల ధరకు ఒప్పందం చేసాం. కానీ ఇప్పుడు అదే ఒప్పందాన్ని 2.11 రూపాయల ధరకు కుదిర్చారు. 25 ఏళ్ల కాలంలో ప్రజాధనంగా రూ.11 వేల కోట్లు ఆ సంస్థకు మళ్లిస్తున్నారన్నారు. ఒప్పందంపై తప్పు ఎక్కడుందో చూపిస్తే మాకే చెప్పండి. రామేశ్వర్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి 2023లో సంస్థకు చైర్మన్ అయ్యారు. కానీ మీడియా వాళ్లు అసత్య ఆరోపణలు చేస్తూ మాపై దూషణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు నిరూపణలతో చెబుతున్నాం. కానీ ఎల్లో మీడియా అబద్ధాలతో మోసం చేస్తోంది. లోకేష్ స్నేహితుడికి 99 పైసలకు భూములు కట్టబెట్టారు. ఈ వ్యవహారాలు చూస్తుంటే ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా ఉన్నట్టు తెలుస్తోందని జగన్ తెలిపారు.