మూడు దశాబ్దాల తర్వాత తోడల్లుళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఒకే వేదికపైకి రాబోతున్నారు. వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ అనే పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా చంద్రబాబు రానున్నారు. గురువారం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. పుస్తక ఆవిష్కరణ కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. అర్ధరాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. ఈ కార్యక్రమంకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా…
సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. "మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే సమ్మక్క సారక్క, సీతమ్మ సాగర్, వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరంలో మూడో ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వమని చెప్పండి. అప్పుడు మేము మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉందని నమ్ముతాం.
వనపర్తి వేదికగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. "రేవంత్ రెడ్డి నీకు చేతనైతే కృష్ణ నీటి విషయంలో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా పాత చింతకాయ పచ్చడి వాగుడే వాగుతున్నాడు. కేసీఆర్ ను తిట్టడం తప్ప ప్రజలకు పనికొచ్చే విషయం ఒక్కటి కూడా మాట్లాడడం లేదు. కన్నతల్లికి పట్టెడన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడట. వంద రోజుల్లో అమలు చేస్తామన్న…
మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మించాలన్నది ఎప్పటి నుండో చిరకాల కోరిక అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్ పోర్టుకు నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవాడిగూడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "స్వాతంత్రం రాకముందే దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం మామునూరు ఎయిర్ పోర్ట్.. హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అవ్వడంతో వరంగల్ విమానాశ్రయానికి తాకిడి తగ్గి హైదరాబాద్ కు పెరిగింది..
AP Budget 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ను రూపొందించింది. ఈ బడ్జెట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రివర్గ సభ్యులు పాల్గొన్నారు. మంత్రి పయ్యావుల అసెంబ్లీలో, మంత్రి కొల్లు రవీంద్ర మండలిలో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నేడు ఉదయం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ జనసేన బీజేపీ కలవడం దగా పడ్డ రాష్ట్రం పునర్నిర్మాణం లక్ష్యంగా ఏర్పాటు జరిగిందని తెలిపారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, ప్రస్తుతం గత ప్రభుత్వానికి సంబంధించి సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంగా చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువు కాటకాలు వస్తాయని ఆరోపించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పూర్తిగా తగ్గిపోతాయి.. ఇప్పుడు మిర్చి ధర పతనం అయ్యిందన్నారు. పెట్టుబడి పెరిగిపోయింది, ఉత్పత్తి తగ్గిపోయింది అని అధికారులు ముందే చెప్పారు.. అయినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు జగన్.. మిర్చి రైతుల ఆవేదన తెలుసుకోవడానికి వస్తే గానీ ప్రభుత్వం మిర్చి రైతుల సమస్య గుర్తుకు…
ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అని, సీఎం చంద్రబాబులా మోసం చేయడం చేతకాదని వైసీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ సిక్స్ కాదని.. సూపర్ సిక్స్ టీ ఇచ్చేవారని విమర్శించారు. 8 నెలల్లో కూటమి ప్రభుత్వం పరపతి కోల్పోయిందన్నారు. నారా లోకేష్ చేసింది యువగళం కాదని.. నిన్న విశాఖ రోడ్లపై వినిపించింది అసలైన యువగళం అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలో చేరికలు, వలసలు సర్వ సాధారణం…
MLC Kavitha : నిజామాబాద్ పసుపు యార్డు ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. నిజామాబాద్ పసుపు యార్డులో.. రైతులు దారుణంగా మోసపోతున్నారని, వారం రోజులుగా ధరలు పడిపోయాయన్నారు. కేంద్రం 15 వేలు మద్దతు ధర ఇస్తామని గొప్పలు చెప్పి రైతులను మోసం చేశారని, పసుపు బోర్డు కు చట్ట బద్దత లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. పార్లమెంట్ లో బిల్లు పెట్టీ .. బిల్లు పాస్ చేస్తే రైతులకు మేలు జరుగుతుందని, పసుపు…
Harish Rao: నాగార్జునసాగర్ నీటి విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై విరుచుకపడ్డారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ నుండి గత మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్కు కుడి కాలువ ద్వారా 10,000 క్యూసెక్కుల నీరు తరలించబడుతోంది. రోజూ సుమారు రెండు టీఎంసీల నీరు ఏపీకి చేరుతోంది. ఈ తరలింపును ఆపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు…