చంద్రబాబు నాయకత్వంలో మహానాడు పేరుతో దగానాడు జరగబోతోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. కేవలం ఏపీలోని ప్రజలకే కాదు.. జెండా మోసిన కార్యకర్తలకు కూడా దగానాడే అని విమర్శించారు.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. మహానాడుపై విమర్శలు గుప్పించారు. జిల్లా జిల్లాకు జరిగిన టీడీపీ కార్యకర్తల ఆక్రోశనాడులు అందరూ చూశారని.. ఓ జిల్లాలో మాజీ సీనియర్ మంత్రి బాధ అంతా ఇంతా కాదన్నారు.. ఈ బాధ పగవాడికి కూడా రాకూడదు అనిపిస్తుందని ఎద్దేవా చేశారు.. ఒక్కచోట కూడా రాష్ట్ర ప్రజలకు తాము ఈ ఏడాదిలో ఈ మేలు చేశాము అని చెప్పిన దాఖలాలు లేవని ఆరోపించారు.. 40 ఏళ్ల ఇండస్ట్రీ, 15 ఏళ్ల ఆవేశం స్టార్, రెడ్ బుక్ స్టార్.. అందరికీ బాస్ చెప్పుకునే మోడీ కూడా ఏపీకి చేసిన మేలు ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.. ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని జనాల్లోకి వెళ్లాలని సిగ్గుపడుతున్నారని విమర్శించారు..
READ MORE: Pak spy: పాక్ గూఢచారికి సహకరిస్తున్న హెల్త్ వర్కర్ అరెస్ట్..
కడపలో జరిగేది మహానాడా.. దగానాడా.. వాళ్ళే చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. మరో జిల్లా మినీ మహానాడు జరపాల్సిన అధ్యక్షుడే సభకు డుమ్మా కొట్టారని.. ఎన్టీఆర్ ఉన్నప్పుడు టీడీపీ వేరు.. ఇప్పుడు టీడీపీ వేరని కార్యకర్తలు ఏడుస్తున్నారన్నారు.. ఎన్టీఆర్ టైం నుంచి పార్టీలో ఉన్నాను అని చెప్పుకునే నేతకు ఓ బ్యానర్ కూడా లేదని బాధపడుతున్నారని చెప్పారు.. ఇంకొక జిల్లాలో కేసులు పెట్టించుకుని పదవుల కోసం రమ్మన్నారని.. ఇప్పుడు పదవులు అమ్ముకుంటున్నారని ఆవేదనకు గురవుతున్నారన్నారు.. మరో జిల్లాలో ఓ మాజీమంత్రి కుమారుడు జగన్ హయంలోనే మాకు మర్యాద దొరికింది.. ఇప్పుడు అది కూడా లేదు అంటున్నారని చెప్పారు.. ఒక ఏడాది ప్రభుత్వాన్ని నడిపి ప్రజలకు చేసింది శూన్యమని తెలిపారు.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ రెండూ లేవని.. తండ్రీకొడుకులు ఇద్దరూ మూటలు కట్టుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు…
READ MORE: Pak spy: పాక్ గూఢచారికి సహకరిస్తున్న హెల్త్ వర్కర్ అరెస్ట్..