CM Chandrababu: సూపర్ సిక్స్ అమలు చేశాం.. కేంద్ర పథకాలను పునరుద్ధరించాం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు పలు అంశాలపై కీలక ప్రసంగించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఆ రోజు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పాం. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నాం అని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇంకా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రం గతంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నదని.. సుమారు రూ.9.72 లక్షల కోట్ల అప్పు భారం కారణంగా ప్రభుత్వ వ్యవస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని చెప్పారు. కేంద్ర సహకారంతో ప్రస్తుతం పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. గతంలో నిలిచిపోయిన కేంద్ర పథకాలను తిరిగి ప్రారంభించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు.
Also Read
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!
జల్ జీవన్ మిషన్ (JJM) అమలుపై కూడా సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రానికి ఈ పథకం కింద రూ.85 వేల కోట్ల అవసరం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం కేవలం రూ.27 వేల కోట్లకే ప్రణాళిక రూపొందించిందని విమర్శించారు. అంతేకాకుండా అసలు లక్ష్యమైన ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా తాగునీరు అందించే విధానం బదులుగా స్టాండ్ అలోన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రాన్ని ఒప్పించి ఈ పథకానికి గడువు పొడిగింపు తెచ్చామని వెల్లడించారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో జల్ జీవన్ మిషన్ అమలులో కొత్త విధానాన్ని అనుసరిస్తున్నామని సీఎం తెలిపారు. అన్ని గ్రామాలకు వెంటనే నిరంతర నీటి సరఫరా సాధ్యం కాకపోవడంతో హైబ్రిడ్ మోడల్ ద్వారా ముందుగా ఇంటింటికీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. భవిష్యత్తులో అవకాశమొస్తే వాటిని పూర్తి స్థాయి అష్యూర్డ్ వాటర్ సిస్టమ్‌కు అనుసంధానం చేస్తామని వివరించారు.
Shiva Rajkumar: పబ్లిక్ ఈవెంట్లలో ‘అసభ్యకర జూమ్’ కల్చర్.. సప్తమి గౌడ పోరాటానికి శివన్న మద్దతు!
ఇంకా.. కేంద్ర పథకాల అమలులో గతంలో ఏర్పడిన సమస్యలను కూడా సీఎం ప్రస్తావించారు. మొత్తం 93 కేంద్ర పథకాలలో 85 పథకాలు నిలిచిపోయిన పరిస్థితి ఉండగా, వాటిని తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. గత ఏడాది వాటిని ట్రాక్‌లో పెట్టామని, ఈ సంవత్సరం పూర్తిగా అమలు చేసి అదనపు నిధులు పొందేలా ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకుందని సీఎం విమర్శించారు. ఎంఆర్ఓ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సర్క్యూట్ హౌస్ వంటి ఆస్తులను తాకట్టు పెట్టి 12 – 13 శాతం వడ్డీతో రుణాలు తీసుకున్నారని చెప్పారు. అయితే ప్రస్తుతం కేంద్ర సహకారంతో రుణాలను పునర్వ్యవస్థీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.43,298 కోట్ల రుణాలను రీషెడ్యూల్ చేయించామని, దీని వల్ల సంవత్సరానికి రూ.327 కోట్ల వరకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని సీఎం చెప్పారు. అలాగే మరో రూ.1.20 లక్షల కోట్ల రుణాలను కూడా పునర్వ్యవస్థీకరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇది సాధ్యమైతే రాష్ట్రానికి సంవత్సరానికి రూ.1,658 కోట్ల వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.
AP Assembly: ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
పోలవరం ప్రాజెక్ట్ విషయానికొస్తే.. ఇది ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమైందని సీఎం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయడం వల్లే పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ముందుకు సాగిందని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సమన్వయంగా ముందుకు సాగుతున్నామని సీఎం స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..