Montha Cyclone Damage: మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టంపై సమీక్షించడానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు నేతృత్వంలోని కేంద్ర బృందం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఈ సమావేశం జరిగింది. తుపాను ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర బృందం ముఖ్యమంత్రికి వివరాలు అందించగా.. రాష్ట్రానికి అవసరమైన తక్షణ ఆర్థిక సహాయం, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ISSF World Championships: చరిత్ర…
SVSN Varma: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పిఠాపురంలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయన్నారు.. గీత అక్కయ్య అమావాస్య పౌర్ణమికి కనిపిస్తూ.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ వంగా గీతపై మండిపడ్డారు.. దమ్ముంటే ఉప్పాడ సెంటర్ కి వచ్చి చర్చించాలి అంటూ సవాల్ చేవారు.. ఎంపీగా పిఠాపురానికి గుండు సున్నా ఇచ్చారు అంటూ వంగా గీతపై విరుచుకుపడ్డారు..…
AP Cabinet Decisions : రాష్ట్రంలో భారీ పెట్టుబడుల దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మొత్తం రూ. లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో 70 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. Stampades : దేవాలయాల్లో తొక్కిసలాటల…
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కూడా పాల్గొన్నారు.
CM Chandrababu : సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మొంథా తుఫాను సమయంలో క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసినందుకు మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రతీ మంత్రి స్వయంగా ప్రాంతాల్లో ఉండి ప్రజలకు వేగంగా సహాయం అందేలా చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. మొంథా తుఫాను సమయంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్లే సహాయక చర్యలు అత్యంత వేగంగా జరిగాయని తెలిపారు సీఎం చంద్రబాబు.…
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో 65కి పైగా కీలక అంశాలపై చర్చించనున్నారు.. క్వాంటం కంప్యూటింగ్ పాలసీ 2025–30కి ఆమోదం తెలపనుంది కేబినెట్.. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూకేటాయింపుల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం చంద్రబాబు…
Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ భేటీ) రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే పెట్టుబడుల సదస్సు (ఇన్వెస్టర్స్ సమ్మిట్) పై క్యాబినెట్ చర్చించనుంది. ఇప్పటికే ఈ సదస్సు ఏర్పాట్ల బాధ్యతలను ముఖ్యమంత్రి మంత్రులు, అధికారులకు అప్పగించారు. రాష్ట్రానికి సుమారు రూ. లక్ష…
CM Chandrababu: గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో నడుస్తున్న శంకర కంటి ఆస్పత్రి నూతన భవనాన్ని, అందులోని సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్పత్రి ప్రాంగణాన్ని పూర్తిగా సందర్శించి, ఆస్పత్రిలోని అన్ని విభాగాల గురించి, నూతనంగా ప్రారంభించిన సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రం యొక్క ప్రత్యేకతల గురించి…
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం రేపు ( నవంబర్ 10న) ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు.
తిరువూరు... పంచాయతీ.. నివేదిక సీఎం చంద్రబాబు కు చేరింది సరైన సమయంలో సరైన నిర్ణయం తీస్కుంటామన్నారు సీఎం చంద్రబాబు. టీడీపీ క్రమ శిక్షణా సంఘంతో చంద్రబాబు భేటి అయ్యారు.