క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేలా రెండు రోజుల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించామని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పార్టీ మోతలు ఎందుకు.. లంచాలు తీసుకొని కంచాలు కొట్టడం ఎందుకు.. అన్ని కోర్టులు తిరస్కరించాకే చంద్రబాబు జైల్లో ఖైదీగా ఉన్నాడు.. ఎవరి కోసం హారన్లు.. ఎవరి కోసం విజిల్స్? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏ మొహం పెట్టుకొని ఇవాళ ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు? అని విజయసాయిరెడ్డి మండిపడ్డాడు. రాజ్యాంగంపై, చట్టంపై నమ్మకం లేని అసాంఘిక శక్తులుగా టీడీపీ పార్టీ మారిందని విమర్శలు గుప్పించాడు.
Read Also: Ayodhya idol: అయోధ్యలోని ఓ రహస్య ప్రాంతంలో తయారవుతున్న రాముడి శిల్పం
ఆంధ్రలో కంటే ఢిల్లీలో కంచాలు కొడితే బాగుంటుంది అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అవినీతి మోతా మోగించాడు కాబట్టే.. చంద్రబాబు ఇంట్లో ఈగల మోతా.. జైల్లో దోమల మోతా ఉంది.. ఈడీ ఆఫీస్ ముందు తప్పుడు కేసు అని లోకేశ్ కొట్టొచ్చు.. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఇంటి ముందు నీకు మద్దతు పలుకుతున్న రేవంత్ రెడ్డి నుంచి జయప్రకాష్ నారాయణ వరకు అందరూ కలిసి కంచాలు కొట్టవచ్చుగా అంటూ నారా లోకేశ్ కు విజయసాయిరెడ్డి చురకలు అంటించాడు. గత రెండు వారాలుగా నారా లోకేశ్ ఢిల్లీలో దాక్కున్నాడు.. నలుగురు ఎంపీలతో పాటు తమకు మద్దతు పలికిన వివిధ పార్టీ నేతలతో కలిసి లోకేశ్ ఢిల్లీలో ఈడీ ఆఫీస్ ముందు కంచాలు కొడితే బాగుంటుంది అని ఆయన అన్నారు.
Read Also: Theft of shoes: బూట్లు దొంగిలించిన దొంగ కోసం పోలీసుల గాలింపు
ఈ ఆందోళన ద్వారా మీరు ప్రజలకు ఏమి చెప్పదలచుకున్నారు.. ఢిల్లీలో దాక్కున్న లోకేశ్ ధైర్యవంతుడా… ఉత్తర కుమారుడా అని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రశ్నించాడు. ప్రాజెక్ట్ ప్రారంభం కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ లో స్కాం జరిగింది అని విజయసాయిరెడ్డి అన్నారు. అభ్యర్థుల విషయంలో కొన్ని మార్పులు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.. దసరా నుంచి వైజాగ్ నుంచే ప్రభుత్వ పాలన ఉంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు.. షెడ్యూల్ ప్రకారమే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతాయి.. ప్రత్యేక హోదా కోసం మా పోరాటం కొనసాగుతోంది అని ఆయన తెలిపారు.