అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు నోటీసులు ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా లోకేశ్ కు సీఐడీ 41ఏ నోటీసులు పంపించింది. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపింది. నోటీసులు అందినట్లు లోకేశ్ సీఐడీకి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అనంతరం నారా లోకేశ్ న్యాయవాదులతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలోని అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి నారా లోకేశ్ ఉన్నారు.
Read Also: Miss Shetty Mr Polishetty: ఓటీటీలోకి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
ఇక, ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి వెళ్లిన నారా లోకేశ్ కు ముగ్గురు అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే, అక్టోబర్ 4వ తేదీన ఉదయం పది గంటలకు రావాలని నోటీసుల్లో సీఐడీ పేర్కొన్నారు. అదే సమయంలో నారా లోకేశ్ కు వాట్సాప్ లోనూ నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. తాను నోటీసులు అందుకున్నానని.. నారా లోకేశ్ వాట్సాప్ లో రిప్లై ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక, సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో మూడో తేదీన జరుగనుంది. ఈ విచారణ కోసం నారా లోకేశ్ న్యాయనిపుణులతో సంప్రదింపులు చేస్తున్నారు.