ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఆయన కుమారుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి ములాకాత్ అయ్యారు.
'నిజం గెలవాలి' పేరుతో చంద్రబాబు సతిమణి నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి ఏపీ వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆవేదనతో మరణించినవారిని ఆమె పరామర్శిస్తారని టీడీపీ శ్రేణులు తెలిపారు.
మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహింహులు పురుగుల మందు డబ్బాతో ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి హల్చల్ చేశారు. కేసీఆర్ ను సమర్థించి తప్పుచేశానన్నారు. దళితబంధు అమలు కాకుంటే తాను చస్తానని గతంలో చెప్పానని.. ఇప్పుడు దళితబంధు అమలు కావటం లేదని తెలిపారు. ఇదిలా ఉంటే.. దళిత యువత తనకు మెసేజ్ లు చేసి తనను చనిపోమని అంటున్నారని పేర్కొన్నారు.