స్కిల్ డెవలప్మెంట్ కేసులో మా కుటుంబం ప్రమేయం లేదు.. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు ఒక పైసా కూడా అవినీతి చేయలేదని స్పష్టం చేశారు నారా లోకేష్.. ఇక, చంద్రబాబుకు ప్రాణహాని ఉంది. వైసీపీ నేతల ఈ విషయం చెబుతున్నారు.. చంద్రబాబు జైల్లోనే చచ్చిపోతారని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
ఒక పని చేస్తే చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి అంబటి రాంబాబు.. విదేశాలకు పంపించిన తన మాజీ పీఏ శ్రీనివాస్ ను వెనక్కి పిలిపించాలని.. శ్రీనివాస్ వెనక్కి వస్తే.. చంద్రబాబుకు వెంటనే బెయిల్ లభించే అవకాశం ఉందన్నారు.