Supreme Court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్.. విచారణ వచ్చే నెలకు వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైబర్ నెట్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తీర్పు వచ్చేంతవరకు ఆగాలని సుప్రీంకోర్టు సూచించింది.. చంద్రబాబు జైలు లోనే ఉన్నారు.. దర్యాప్తు చేసుకోవచ్చు కదా అని సీఐడీకి సూచించింది ధర్మాసనం. “ఫైబర్ నెట్” కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేయగా.. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపులలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు నమోదు చేసింది సీఐడీ.. చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ “టేరా సాప్ట్” కు నిబంధనలు ఉల్లంఘించి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపించింది.. బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని..
అవినీతి జరిగిందని చెబుతోంది..
ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కాగా.. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు సిద్దార్ధ్ లూద్రా.. అయితే, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చేంతవరకు వేచి చూడాలన్నారు జస్టిస్ బోస్.. ఇక, చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నవంబర్ 8వ తేదీన తీర్పు వెలువడనుండా.. ఇప్పుడు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కాగా, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం విదితమే.. గత నెల 9వ తేదీన అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్ 42వ రోజుకు చేరింది.. ఇక, ఆయన రిమాండ్‌ను నవంబర్ 1వ తేదీ వరకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం గురువారం రోజు పొడిగించిన విషయం విదితమే.
Also Read
- Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
Read Also: MLA Lakshma Reddy: అభివృద్ధి వైపే మా పయనం.. లక్ష్మారెడ్డికే మా మద్దతు
తాజావార్తలు
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
ట్రెండింగ్
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!