MP Margani Bharat: చంద్రబాబుకు ఓట్లు కావాలి.. పవన్ కల్యాణ్‌కి నోట్ల కట్టలు కావాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Margani Bharat: మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. టీడీపీ పల్లకీ మోయడానికే పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టారు.. తప్పిస్తే ప్రజల కోసం కాదని వ్యాఖ్యానించారు.. రాజమండ్రిలో. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు తన సొంత కొడుకు సమర్ధతపై నమ్మకం లేకనే సినీ గ్లామర్ తో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారన్నారని విమర్శించారు. టీడీపీ, జనసేన దొందుకు దొందేనని ఎప్పటినుంచో చెబుతూ వచ్చామన్నారు. అసలు పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెట్టిందే టీడీపీ కోసమని.. ప్రజల కోసం, అభిమానుల కోసం కాదన్నారు. చంద్రబాబుకు ఓట్లు కావాలి, పవన్ కల్యాణ్‌కు నోట్ల కట్టలు కావాలంటూ ఆరోపణలు గుప్పించారు.
జనసేన పార్టీ పెట్టిన గత పదీ పదిహేను సంవత్సరాల నుంచి ముసుగేసుకుని రాజకీయాలు చేసిన పవన్ కల్యాణ్ చివరకు చంద్రబాబు భారీ అవినీతి స్కామ్ లో అడ్డంగా బుక్కై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండటంతో.. పవన్ ‘రథసారథి’ పాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు భరత్ రామ్. ఇప్పుడు తన ముసుగును పవన్ తొలగించి ‘పొత్తు’ పేరుతో మరో రాజకీయ కుప్పిగంతులకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. ఇక, టీడీపీ, జనసేన రాజమండ్రిలో భేటీ అయినంత మాత్రాన ఫలితమేమీ ఉండదన్నారు. చంద్రబాబు గత 40 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటేనే ప్రజల నుంచి ఎటువంటి స్పందనా, సానుభూతి కనిపించలేదని విమర్శించారు. మొన్న కంబాల చెరువు పార్కు ప్రారంభోత్సవానికి వేలాదిగా జనం వచ్చారు.. అలాగే దేవీ నవరాత్రులకు అత్యంత భక్తిప్రపత్తులతో జనం తరలి వస్తున్నారు.. మరి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని బిల్డప్ ఇచ్చే చంద్రబాబు అరెస్టు అయితే ఎందుకు స్పందించడం లేదో గ్రహించాలన్నారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
చంద్రబాబు నక్క జిత్తుల రాజకీయాలను అర్ధం చేసుకున్నారు కాబట్టే ప్రజల్లో స్పందన, సానుభూతి కనిపించడం లేదన్నారు ఎంపీ భరత్. అలాగే జనసేన పవన్ కల్యాణ్‌కు రాజకీయ కార్యాచరణ లేదని, కౌలు రైతులు ఓ పదీ పదిహేను మందికి డబ్బులిచ్చేస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ ను రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా విశ్వసించారని, వైసీపీ పాలనకు నూటికి నూరు శాతం మద్దతిస్తున్నారని తెలిపారు. ఓటు చాలా విలువైనదని, వృథా చేసుకోవద్దని ఈ సందర్భంగా ప్రజలకు ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రజలు మరోసారి వైఎస్ జగన్‌ని సీఎంను చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలిపారు ఎంపీ మార్గాని భరత్ రామ్.
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!