మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహింహులు పురుగుల మందు డబ్బాతో ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి హల్చల్ చేశారు. కేసీఆర్ ను సమర్థించి తప్పుచేశానన్నారు. దళితబంధు అమలు కాకుంటే తాను చస్తానని గతంలో చెప్పానని.. ఇప్పుడు దళితబంధు అమలు కావటం లేదని తెలిపారు. ఇదిలా ఉంటే.. దళిత యువత తనకు మెసేజ్ లు చేసి తనను చనిపోమని అంటున్నారని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట దగ్గర చెప్పిన మాటను నిలబెట్టుకోమని దళిత యువత కోరుతుందని అన్నారు.
Read Also: Israeli–Palestinian conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. ఇరాన్ ఎంటరైతే..!
కేసీఆర్ ముహూర్తం పెడితే గడ్డి మందు తాగి చనిపోతానని.. దళితులకు అన్యాయం జరిగితే గడ్డి మందు తాగి చచ్చిపోతానని మోత్కుపల్లి అన్నారు. కేసీఆర్ గట్టిగా ఉన్నాడు. ఆయన ఎలాగూ చావడు. నేనైనా చచ్చిపోతానని పేర్కొ్న్నారు. నా పెద్దన్న కేసీఆర్ మాటకు విలువే లేదు.. మోసాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ అని విమర్శించారు. తమ ఇద్దరకీ మాటలు లేకున్నా.. దళితబంధు పెడ్తున్నాను రావాలని స్వయంగా కేసీఆర్ పిలిస్తే వెళ్ళానని చెప్పుకొచ్చారు. దళితబంధుతో దళిత జాతికి మేలు జరుగుతోందని కేసీఆర్ ను సమర్థించానని.. మాదిగ కులానికి కేసీఆర్ మంత్రి పదవి కూడా ఇవ్వలేదని
ఆయన అన్నారు.
Read Also: Minister Jogi Ramesh: వచ్చే 20 ఏళ్ళ పాటు జగనే రాష్ట్రానికి సీఎం
ఇదిలా ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై మోత్కుపల్లి స్పందించారు. చంద్రబాబుకు ప్రాణ హాని ఉన్నదని, ఆయన ప్రాణానికి ఏమైనా హాని జరిగితే బీజేపీ, ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌దే బాధ్యత అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి చంద్రబాబుపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని.. చంద్రబాబు కుటుంబాన్ని జైల్లో వేసే కుట్ర జరుగుతుంది అని తెలిపారు.