Supreme Court: ఫైబర్ నెట్ కేసు.. నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించిన విషయం విదితమే.. మరోవైపు.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసు.. ఇలా చంద్రబాబుపై రకరకాల అభియోగాలు నమోదు అయ్యాయి.. అయితే, ఈ రోజు సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసుపై విచారణ జరగనుంది.. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా. ఎమ్. త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్నారు.. 9వ నెంబర్ గా చంద్రబాబు బెయిల్ పిటిషన్ లిస్ట్ అయ్యింది.. అయితే, ఫైబర్ నెట్ కేసులో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్‌కు హైకోర్టు నిరాకరించడంతో.. దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చంద్రబాబు నాయుడు.
Read Also: Urvashi Rautela: ఊర్వశికి షాక్.. ఫోన్ కొట్టేసిన వ్యక్తి కండీషన్ ఏంటో తెలుసా..?
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వెకేషన్ బెంచ్‌కు హైకోర్టు బదిలీ చేసిన విషయం విదితమే.. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేసిన హైకోర్టు.. దసరా సెలవుల తర్వాతే విచారిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషిన్‌పై విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేయాలని చంద్రబాబు తరఫు లాయర్లు విజ్ఞప్తి చేశారు.. చంద్రబాబు లాయర్ల అభ్యర్థనకు అంగీకరించింది హైకోర్టు.. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్‌పై విచారణను దసరా సెలవుల్లో హైకోర్టు వెకేషన్ బెంచ్ చేపట్టనుంది.
తాజావార్తలు
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!