ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా తదుపరి మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరాయి. కాగా.. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడకపోవచ్చు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మకు ఈ మ్యాచ్‌కు విశ్రాంతి ఇవ్వవచ్చని సమాచారం.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నేడు మరో ఆసక్తికర సమరం జరగనుంది. సెమీ ఫైనల్ బెర్తు కోసం ఆస్ట్రేలియాతో అఫ్గానిస్థాన్ తలపడనుంది. గత మ్యాచ్‌లో పటిష్ట ఇంగ్లండ్‌కు షాకిచ్చిన అఫ్గాన్.. మరో సంచలన విజయం సాదిస్తుందేమో చూడాలి. 2024 టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓడింది. అంతేకాదు గతేడాది టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరిన అఫ్గాన్‌కు.. వరుసగా రెండో ఐసీసీ సెమీస్ చేరే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అఫ్గానిస్థాన్ ఒడిసిపడుతుందో లేదో మరి. ఇంగ్లండ్‌పై…
2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి పాకిస్తాన్ జట్టు ముందుగానే నిష్క్రమించింది. బంగ్లాదేశ్‌తో ఈరోజు జరగాల్సిన నామమాత్రపు మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకుందామనుకున్న పాక్.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది. దీంతో.. పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి ఔటయింది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ స్పందించాడు. తమ ప్రదర్శనపై సాకులు వెతకడం లేదని అన్నారు. ఈ టోర్నీలో తమ అభిమానుల అంచనాలను అందుకోలేదని రిజ్వాన్ నిరాశ వ్యక్తం చేశాడు. పాకిస్తాన్…
భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ సెంట్రల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు తిరిగి ప్రారంభించాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని చెప్పారు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలువలేదు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో.. స్వదేశంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో విజయం సాధించనందుకు ఆ దేశ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయాలని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సూచించాడు. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వాలని తెలిపాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో టోర్నీలో 9వ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. నిరంతర వర్షం, తడి అవుట్ ఫీల్డ్ కారణంగా టాస్ కూడా పడలేదు. టాస్ పడకముందు నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటికీ ఎడతెరిపి ఇవ్వకపోవడంతో అంఫైర్లు మ్యాచ్ రద్దు చేశారు.
Joe Root: లాహోర్ వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జట్టు అసాధారణ ప్రదర్శన చేసి ఇంగ్లండ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించేలా చేసింది. అఫ్గాన్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ (5 వికెట్లు), బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్ (177 పరుగులు) అద్భుత ప్రదర్శనతో అఫ్గానిస్తాన్‌ను 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణిత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. అనంతరం,…