భారత సారథి, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి సెమీ ఫైనల్లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా హిట్‌మ్యాన్ సిక్సర్ బాదాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో రోహిత్‌కు ఇది 65వ సిక్స్. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్…
AUS vs IND: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (73: 96 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ క్యారీ (61; 57 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్థ శతకాలతో రాణించగా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది.
IND vs AUS: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్ కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది. భారత్ వరుసగా 14వ సారి టాస్‌ను కోల్పోయింది.
దుబాయ్ తమ సొంతగడ్డ కాదు అని, ఇక్కడ భారత్ ఎక్కువ మ్యాచ్‌లేమీ ఆడలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. దుబాయ్ పిచ్ ప్రతిసారీ భిన్న సవాళ్లను విసురుతోందని, తాము ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కోసారి ఒక్కో రకంగా స్పందించిందన్నాడు. దుబాయ్ మైదానంలో నాలుగు పిచ్‌లు ఉన్నాయని, సెమీ ఫైనల్ దేనిపై ఆడిస్తారో తెలియదని హిట్‌మ్యాన్ చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఒకే మైదానంలో ఆడుతోందని, భారీ లాభం పొందుతోందని కొందరు మాజీలు, క్రికెటర్లు అంటున్న…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నాకౌట్ మ్యాచ్‌లకు సమయం ఆసన్నమైంది. మొదటి సెమీస్‌లో టాప్ టీమ్స్ భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. లీగ్ దశలో మూడుకు మూడు మ్యాచ్‌లలో ఘన విజయాలు సాధించిన రోహిత్ సేనకు సెమీస్ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఐసీసీ టోర్నీల్లో నాకౌట్‌లో కంగారూలు రెచ్చిపోతారు. అయితే దుబాయ్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడిన అనుభవం, పిచ్‌కు తగ్గ బలమైన స్పిన్ ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ ఆరంభమైంది. మూడు లీగ్ మ్యాచుల్లో ఘన విజయాలు సాధించిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాపై అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. టీమిండియా ఈ మ్యాచులో గెలిచి ఫైనల్ చేరాలని భావిస్తోంది. అంతేకాదు 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. అయితే స్టార్ ఆటగాళ్ల గైర్హాజరీలో ఆసీస్ కొంత బలహీన పడ్డట్లు కనిపిస్తున్నా.. ఆ జట్టును తక్కువ అంచనా…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా కరాచీలోని నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించి సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 29.1 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(27), ట్రిస్టన్ స్టబ్స్(0) విఫలమైనా.. రాసీ వాన్…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. 11వ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ-ఫైనల్స్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ షార్ట్ గాయపడ్డాడు. ఈ క్రమంలో అతను సెమీ-ఫైనల్స్‌కు దూరం కానున్నాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. వర్షం కారణంగా ఆట రద్దైంది. 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 12.5 ఓవరల్లో ఒక వికెట్ కోల్పోయి 109 పరుగులు చేసింది. అయితే వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.