జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జరిగిన అవకతవకల పై రాష్ట్రానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్రంలో 9 జూన్ నుండి 12 జూన్ 2022 వరకు మహాత్మా గాంధీ NREGS అమలుకు సంబంధించి కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. NREGS అమలులో అనేక అవకతవకలు గుర్తించింది. అనుమతి లేని పనులను చేపట్టడం (అటవీ ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు ఆరబెట్టే ప్లాట్‌ఫారమ్ లేదా అస్థిరమైన కందకాల…
దేశంలో ఎక్కువ జనాభా ఉన్న 18-59 మధ్య వయస్సు వారికి బూస్టర్ ఇవ్వడంలో ఇంకా క్లారిటీ రాలేదు. కేవలం 12 ఏండ్లలోపు, 60 ఏండ్లు పైబడినవారికే టీకా వేసేందుకు అనుమతి ఇస్తున్నది. అనేక రాష్ట్రాల్లో టీకా నిల్వలు పేరుకుపోయినప్పటికీ 18+కు బూస్టర్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో మిగిలిపోయిన 32 లక్షల డోసులను ప్రభుత్వం ఆధ్వర్యంలో 18-59 ఏండ్ల మధ్యవారికి బూస్టర్ డోస్ వేయడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ను…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ కూలీల చెల్లింపుల నిమిత్తం రూ. 685.12 కోట్ల మేర నిధులను విడుదల చేసింది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. నాలుగు రోజుల్లో రాష్ట్ర నోడల్ ఖాతాకు రూ. 622 కోట్ల జమ కాబోతున్నాయి. ఇక, గత రెండు రోజులుగా రూ. 302.96 కోట్ల మేర కూలీలకు చెల్లింపులు చేసింది ప్రభుత్వం.. వచ్చే రెండు-మూడు రోజుల్లో రూ. 319 కోట్లను కూలీల ఖాతాల్లో జమ చేయనున్నట్టు పంచాయతీ…
మైనారిటీల గుర్తింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… రాష్ట్ర స్థాయిలో హిందువులు సహా మైనారిటీలను గుర్తించే అంశంపై కేంద్రం భిన్నమైన వైఖరిని అవలంభించడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది మరియు మూడు నెలల్లో ఈ అంశంపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని ఆదేశాలు జారీ చేసింది.. దేశంలో హిందువులు 10 రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారని, రాష్ట్ర స్థాయిలో మైనార్టీల గుర్తింపు కోసం మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది…
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు నరకం చూస్తున్నారు.. కొనే పరిస్థితి లేదు.. అమ్మడానికి కూడా ఏమీ లేదు అనే తరహాలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.. ఇప్పటికే శ్రీలంకకు భారత్ భారీ సాయం చేయగా.. ఇప్పుడు.. శ్రీలంకలోని తమిళులకు సాయం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ తరపున కోటి రూపాయలు విరాళంగా ఇవ్వనున్నారు.. ప్రభుత్వం తరపున మొదటి విడతగా 40 వేల టన్నుల బియ్యం, 500 టన్నుల మిల్క్ పౌడర్,…
ఒమిక్రాన్ వేరియంట్ ఎంట్రీ తర్వాత థర్డ్ వేవ్ రూపంలో మరోసారి భారత్‌పై విరుచుకుపడిన కరోనా మహమ్మారి కేసులు.. క్రమంగా తగ్గుముఖం పట్టాయి.. దీంతో, కోవిడ్ ఆంక్షలను కూడా ఎత్తివేసింది ప్రభుత్వం.. అయితే, కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్రం.. ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది.. హర్యానా, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, మిజోరాంలలో గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయని తెలిపిన కేంద్రం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని పేర్కొంటూ కేంద్ర…
జీడీపీ పెంచమంటే.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీస్ వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంపై ఫైర్ అయ్యారు.. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలే మనల్ని రోడ్లపైకి తీసుకువచ్చిందన్న కవిత.. తెలంగాణ ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చిన ఘనత మోడీ సర్కార్ కు దక్కుతుందని ఎద్దేవా చేశారు.. తెలంగాణలో రైతులు…
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగాను మరింత వేగవంతం చేసింది. ఇవాళ ఒక్కరోజే 8 వేల మందిని తరలించినట్లు కేంద్రం తెలిపింది. చివరి 24 గంటల్లో 18 విమానాల్లో 8 వేల మందిని భారత్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడించింది. మరో 24 గంటల్లో 16 ప్రత్యేక విమానాలను ఏర్పాటుచేసి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ విమానాల్లోనే 10 వేల 344 మందిని భారత్‌కు తరలించినట్లు…
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త సవరణలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది… హిట్ అండ్ రన్ మరణాల పరిహారాన్ని కేంద్రం రూ.25,000 నుంచి రూ.2 లక్షలకు పెంచింది.. దేశంలో ఇప్పటి వరకు హిట్ అండ్ రన్ కేసుల పరిహారం రూ.25,000గా ఉండగా… ఇకపై ఈ కేసుల పరిహారం రూ.2 లక్షలకు కేంద్రం సవరించింది… ఈ మేరకు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆ…
ఒక్కో ఏడాది లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ పట్టాలు అందుకుంటున్నారు.. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. కొందరు తగిన ఉద్యోగం దొరకపోయినా.. ఎక్కడో తోచిన పని చేసుకుంటున్నారు.. కొందరికి అది కూడా సాధ్యం కావడం లేదు.. ఇక, నిరుద్యోగం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అన్ని పార్టీలు.. మేం అధికారంలోకి వస్తే.. లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తామిని హామీలు ఇవ్వడం మామూలే.. కానీ, వాళ్లు అధికారంలోకి వచ్చిన…