Hit And Run: కేంద్రం కీలక నిర్ణయం.. పరిహారం భారీగా పెంపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న చట్టానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త సవరణలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది… హిట్ అండ్ రన్ మరణాల పరిహారాన్ని కేంద్రం రూ.25,000 నుంచి రూ.2 లక్షలకు పెంచింది.. దేశంలో ఇప్పటి వరకు హిట్ అండ్ రన్ కేసుల పరిహారం రూ.25,000గా ఉండగా… ఇకపై ఈ కేసుల పరిహారం రూ.2 లక్షలకు కేంద్రం సవరించింది… ఈ మేరకు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆ నోటిఫికేషన్ ప్రకారం హిట్ అండ్ రన్ బాధితుల బంధువులకు ఏప్రిల్ 1 నుండి నష్టపరిహారం ఎనిమిది రెట్లు పెంచింది.. అంటే.. ఏప్రిల్ 1 నుంచి ఈ కేసుల్లో మరణించినవారికి రూ.2 లక్షల పరిహారం అందించనుంది. ఇక, హిట్ అండ్ రన్ కేసులో తీవ్ర గాయాలపాలైన వ్యక్తికి ఇచ్చే సొలేటియం ప్రస్తుతం రూ.12,500గా ఉండగా.. దానిని రూ.50,000కి పెంచింది.
Read Also: IND vs SL: రోహిత్ శర్మ కొత్త రికార్డు.. ప్రపంచంలోనే ఒకేఒక్కడు..
Also Read
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ఫిబ్రవరి 25న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ‘హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్స్ స్కీమ్ బాధితులకు పరిహారం’, 2022 అని పిలవవచ్చని మరియు ఇది ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వస్తుందని పేర్కొంది.. కాగా, ఆగస్టు 2, 2021న మంత్రిత్వ శాఖ ద్వారా ఈ ముసాయిదా పథకం నోటిఫై చేయబడింది. ప్రస్తుతం హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి 1989 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తున్నారు. పాత చట్టంలో నష్టపరిహారం చాలా చాలా తక్కువగా ఉండటంతో కేంద్రం కీలక సవరణలు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గరున్న వివరాల ప్రకారం 2020లో దేశవ్యాప్తంగా 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 1,31,714 మంది మృతిచెందారు. హిట్ అండ్ రన్ కేసుల్లో మృతులకు, బాధితులకు పరిహారం కోసం ప్రభుత్వం మోటర్ వెహికల్స్ యాక్సిడెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ల విషయంలో పరిహారం అందించడానికి మరియు ప్రమాద బాధితులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది.
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!