ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగాను మరింత వేగవంతం చేసింది. ఇవాళ ఒక్కరోజే 8 వేల మందిని తరలించినట్లు కేంద్రం తెలిపింది. చివరి 24 గంటల్లో 18 విమానాల్లో 8 వేల మందిని భారత్‌కు తీసుకొచ్చినట్లు వెల్లడించింది. మరో 24 గంటల్లో 16 ప్రత్యేక విమానాలను ఏర్పాటుచేసి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ విమానాల్లోనే 10 వేల 344 మందిని భారత్‌కు తరలించినట్లు కేంద్రం వెల్లడించింది. ఉక్రెయిన్ సరిహద్దుల తరలివస్తున్న భారతీయులను తరలించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది.
ఇక, యుద్ధం జరుగుతున్న జోన్లలో ఇప్పటికీ కనీసం వెయ్యి మంది భారతీయులున్నారని చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. తూర్పు ఉక్రెయిన్‌లో యుద్ధం జరుగుతున్న ఖార్కైవ్‌లో 300 మంది, సుమీలో 700 మంది భారతీయులున్నారని.. సుమారు 2 నుంచి 3 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ యుద్ధ జోన్లలో ఉండచ్చని అంచనా వేసింది కేంద్రం. సుమారు 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులు దాటారని.. గత 24 గంటల్లో మొత్తం 15 విమానాల్లో మూడు వేల మంది భారతీయులును స్వదేశానికి తరలించామని తెలిపారు. చిక్కుకుపోయున భారతీయులను వచ్చే 24 గంటల్లో మరొక 16 విమానాల్లో తీసుకొస్తున్నాం. “ఆపరేషన్ గంగా” కార్యక్రమం కింద మొత్తం 48 విమానాల్లో 10,300 మంది భారతీయ విద్యార్థులను తరలించామని వెల్లడించారు..సుమీ విశ్వవిద్యాలయంలోని హాస్టళ్లలో సుమారు 800-900 మంది భారతీయ విద్యార్థులున్నారు. చాలినంత ఆహారం, తాగటానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, అక్కడ నుంచి తరలించాలని కోరుతున్నారు. చిక్కుకుపోయున భారతీయ విద్సార్దులను తరలించేందుకు కాల్పుల విరమణ సహాయ పడుతుందని.. విద్యార్థులను తరలించేందుకు, సురక్షిత మార్గాన్ని చూపాలని రెండు దేశాలను విజ్ఞప్తి చేశామని కేంద్రం చెబుతోంది.