ఒక్కో ఏడాది లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ పట్టాలు అందుకుంటున్నారు.. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. కొందరు తగిన ఉద్యోగం దొరకపోయినా.. ఎక్కడో తోచిన పని చేసుకుంటున్నారు.. కొందరికి అది కూడా సాధ్యం కావడం లేదు.. ఇక, నిరుద్యోగం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అన్ని పార్టీలు.. మేం అధికారంలోకి వస్తే.. లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తామిని హామీలు ఇవ్వడం మామూలే.. కానీ, వాళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ రివర్స్‌గా ఉంటుంది.. ఇక, ఉన్నత చదువులు చదినా ఉద్యోగం రాలేదన్న బాధతో కొందరు.. నిరుద్యోగం కారణంగా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను.. పైగానే నేనే వారికి భారంగా మారిపోయానని మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు.. మూడేళ్లలో 2018 నుంచి 2020 వరకు దేశవ్యాప్తంగా ఏ కంగా 25,000 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.
Read Also: Bharti Airtel: వినియోగదారులకు మరో షాక్..!
రాజ్యసభలో ఈ అంశంపై ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) అందించిన డేటా ఆధారంగా ప్రభుత్వ గణాంకాలు ఉన్నాయన్న ఆయన.. మూడేళ్లలో (2018-2020) దేశంలో నిరుద్యోగం కారణంగా 25,000 మంది ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. ఇందులో ఉద్యోగం రాలేదని 9,140 మంది ఆత్మహత్య చేసుకోగా.. 16,091 మంది నిరుద్యోగం వల్ల తలెత్తిన ఆర్థిక సమస్యలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.. కాగా, గత కొన్ని వారాలుగా నిరుద్యోగ సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంచి రోజులు అంతంతమాత్రంగా ఉన్నాయని చెప్పడానికి ఒక సర్వేను కూడా ఉదహరించారు.. డేటా ప్రకారం 2020లో నిరుద్యోగులలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.. అత్యధికంగా 3,548 మంది ఒకే ఏడాది ప్రాణాలు తీసుకున్నారు.. ఇక, 2018లో 2,741 మంది నిరుద్యోగం కారణంగా జీవితాన్ని ముగించగా, 2019లో 2,851 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.. 2018లో 4,970 మంది దివాలా తీయడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని, 2019లో ఆ సంఖ్య 5,908కి పెరిగిందని, 2020లో 600 మరణాలు తగ్గి 5,213కి చేరుకున్నాయని వెల్లడించారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్.. ఇక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించి ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం చూస్తోందన్న ఆయన.. మానసిక రుగ్మతల భారాన్ని పరిష్కరించడానికి, ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని (NMHP) అమలు చేస్తోందన్నారు..