నీట్-పీజీ 2021 విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.. పీజీ వైద్యవిద్య, సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్-పీజీ 2021 పరీక్షలో పాత సిలబస్‌నే పునరుద్ధరించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. పరీక్ష నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బీటీ)లపై మండిపడింది… పాత సిలబస్ ప్రకారం టెస్ట్ నిర్వహించడంతోపాటు వచ్చే ఏడాదికి ఎంట్రన్స్ తేదీలను మార్చాలని కూడా ఆదేశాలు జారీ చేసింది సుప్రీం.. ఇక, ఈ కేసులో రేపు…
నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను మరో సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధం అయ్యిందంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే బిడ్లను ఆహ్వానించినా.. ఎక్కువ సంస్థలు మాత్రం పోటీ పడింది లేదు.. ఈ దశలో చివరి వరకు నిలిచింది మాత్రం టాటా గ్రూపే.. దీంతో.. టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా వెళ్లిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి.. ఎయిరిండియాని 68 ఏళ్ల తర్వాత ఆ సంస్థ అసలు యజమాని అయినట్టువంటి టాటా గ్రూప్ చేతికి వెళ్లిందనేది…
సబ్సిడీతో కూడిన వంట గ్యాస్ ధర వెయ్యి రూపాయలకు చేరువవుతోంది.. పెట్రో ధరలతో పాటు క్రంగా గ్యాస్ ధరలు కూడా మండిపోతున్నాయి. ఇదే సమయంలో.. వంట గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.. దీనిపై అంతర్గతంగా చర్చ ప్రారంభం అయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. వరుసగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలపై ప్రభుత్వం ఓ సర్వే కూడా నిర్వహించిందట.. ఆ సర్వేలో.. పెరిగిన గ్యాస్ ధరలను చెల్లించేందుకు…
చైనాలో పుట్టిన కరోనా వైరస్ రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడీస్తోంది. చౌకగా వస్తువులను అమ్మకానికి పెట్టినంత ఈజీగా చైనా కరోనాను కూడా ప్రపంచ దేశాలకు అతి తక్కువ సమయంలోనే ఎగుమతి చేసింది. ఇంకేముంది.. ప్రపంచ దేశాలన్నీ కరోనా బారిన పడటంతో కోట్లాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ అయితే పేకమేడలా కుప్పకూలిపోయింది. దీంతో చాలామంది నడిరోడ్డున పడాల్సి వచ్చింది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయట పడుతోంది.…
కరోనా మహమ్మారి బారినపడి చనిపోయినవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని నిర్ణయించింది కేంద్రం.. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ గైడ్‌లైన్స్ విడుదల చేసింది.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనుంది కేంద్రం.. ఈ మొత్తాన్ని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ ద్వారా ఇస్తామని పేర్కొంది. ఈ మొత్తాన్ని పొందాలంటే సదరు వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు…
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ… రైతులు గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీ సరిహద్దులు నిరసనలతో హోరెత్తుతున్నాయి. రైతులు ఢిల్లీ రాకుండా రోడ్లను మూసేశారు. సరిహద్దుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో నెలలతరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇబ్బందిపడ్డారు. ఇదే విషయంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. గమ్యస్థానాలకు చేరుకోవడానికి, చుట్టూ తిరిగి చాలాదూరం ప్రయాణించాల్సి వస్తోందని జాతీయ మానవహక్కుల…
కరోనా మహమ్మారి తరిమేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.. భారత్ ఒకేరోజు కోటి డోసుల వ్యాక్సిన్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. తాజాగా, భారత్ వ్యాక్సినేషన్‌లో కొత్త రికార్డు సృష్టించింది.. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ఏకంగా 18 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.. ఆ నెలలో జీ7 దేశాల్లో వేసిన మొత్తం వ్యాక్సిన్ల కంటే కూడా.. భారత్‌లో వేసిన వ్యాక్సిన్ల సంఖ్యే ఎక్కువని తెలిపింది కేంద్రం.. ఆగస్టు నెలలో భారత్‌లో…
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించింది కేంద్రం… ఎప్పటికప్పుడు దీనిపై అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అలెర్ట్ చేస్తూ.. కావాల్సిన డోసులు సరఫరా చేస్తోంది.. ఇక, వ్యాక్సినేషన్‌పై తాజాగా ఓ ప్రకటన చేసింది కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. ప్రస్తుతం వ్యాక్సినేషన్ శరవేగంగా సాగుతోందని తెలిపిన కేంద్రం.. ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 65,00,99,080 వ్యాక్సిన్ డోసులను పంపించాం.. త్వరలో మరో 1,20,95,700 వ్యాక్సిన్ డోసులు సమకూర్చనున్నట్టు ప్రకటించింది. అయితే,…
కరోనా మహమ్మారి విజృంభణతో ఐటీ రిటర్న్స్ గడువును పొడిగిస్తూ వచ్చింది ప్రభుత్వం.. అయితే, ఇప్పుడు కొత్త వెబ్‌సైట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో కూడా ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు గడువును ఆదాయ పన్నుశాఖ పొడిగిస్తూ వస్తోంది… ఇప్పుడున్న డెడ్‌లైన్ ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంది.. కానీ, మరోసారి ఈ గడువును పొడిగించే అవకాశం ఉందని చెబుతున్నారు.. కొత్త వెబ్‌సైట్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సెప్టెంబర్ 15వ తేదీ…
త్వరలోనే వాహనదారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి.. దేశవ్యాప్తంగా కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియతో.. రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీ సులభతరం కానుంది.. ఇది అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ సిరీస్)తో రిజిస్ట్రేషన్లు చేస్తారు.. ఈ ప్రక్రియతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ రీత్యా బదిలీ అయ్యే ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.. మరో రాష్ట్రానికి బదిలీ అయి వెళ్లగానే…