వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ కనుమలను పర్యావరణ సున్నిత ప్రాంతం (ఈఎస్‌ఏ)గా ప్రకటించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
రేపు ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొననున్నారు. ఇండియా కూటమికి చెందిన ఇతర ముఖ్యమంత్రుల మాదిరిగానే ఆమె కూడా సమావేశానికి హాజరుకాకుండా ఉంటారా అనే సస్పెన్స్ కు తెర తీసింది. ఈ క్రమంలో.. నీతిఆయోగ్ సమావేశానికి హాజరవడం కోసం శుక్రవారం ఆమె కలకత్తా నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
వైసీపీ హయాంలో కేంద్రం నుంచి ఏపీకి డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులకు కేంద్రం ఝలక్ ఇస్తుంది. ఏపీ ప్రభుత్వ ఆమోదం లేకుండా మాతృ శాఖల్లో చేరడానికి వచ్చే అధికారులకు నో ఎంట్రీ బోర్డు పెడుతుంది. కేంద్ర సర్వీసుల నుంచి డెప్యూటేషన్ మీద వచ్చిన అధికారులను రిలీవ్ చేయొద్దని గతంలోనే సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్‌సభలో ప్రసంగిస్తూ దేశంలోని వృద్ధులకు శుభవార్త చెప్పారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. 70 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ పథకం కింద చికిత్స అందజేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ ఈ హామీ ఇచ్చింది. కొత్త ప్రభుత్వంలో 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ ప్రయోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్రపతి ముర్ము గురువారం పార్లమెంట్ హౌస్‌లో తెలిపారు. అంతేకాకుండా.. రైతుల కోసం ప్రభుత్వం నిరంతరం కృషి…
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సరోగసీ ద్వారా తల్లులైనా ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఆరు నెలల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం 50 ఏళ్ల నాటి నిబంధనను సవరించింది. సరోగసీ అంటే అద్దె గర్భం ద్వారా బిడ్డకు జన్మనివ్వడం. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్, 1972లో చేసిన మార్పుల ప్రకారం.. తల్లి (సరోగసీ ద్వారా జన్మించిన బిడ్డను మోస్తున్న తల్లి) పిల్లల సంరక్షణ కోసం సెలవు తీసుకోవచ్చు.. అంతేకాకుండా.. తండ్రి కూడా 15…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తన మొదటి పర్యటనలో భాగంగా సోమవారం పోలవరం వెళ్లనున్నారు.
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పెట్టుబడి సాయం.. పీఎం-కిసాన్ పథకం 17వ విడత నిధులు వచ్చేవారం విడుదల కానున్నాయి. జూన్ 18న రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని మోడీ పీఎం కిసాన్ నిధులను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ శనివారం వెల్లడించారు.
ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారని.. తనపై నమ్మకంతో ప్రధాని మోడీ పౌర విమానయాన శాఖ అప్పగించారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తనపై పెట్టిన బాధ్యతకు సంపూర్ణ న్యాయం చేస్తానని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా అన్నారు.
India Alliance Meeting Today in Delhi on Government Formation: సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకింద్రులు చేస్తూ.. 199 సీట్లు సాధించింది. ‘400 సీట్లకు పైనే’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ సారథ్యంలోని ‘ఎన్డీయే’ మెజారిటీకే పరిమితం అయింది. అయితే ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య సీట్ల వ్యత్యాసం ఎక్కువగా లేకపోవడంతో.. ఇరు కూటమిలు ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే చర్చలు ప్రారంభించాయి. కేంద్రంలో…
రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందు కోసం భూ సేకరణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2, 911 కోట్ల రూపాయలుగా ఉంది.