ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తన మొదటి పర్యటనలో భాగంగా సోమవారం పోలవరం వెళ్లనున్నారు. ప్రాజెక్టును సందర్శించి వాటి ప్రస్తుత స్థితిగతులను జలవనరులశాఖ అధికారులతో సమీక్షించనున్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు పూనుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారన్నారు. పోల వరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధా న్యత కారణంగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు రానుండడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
READ MORE: Suresh Gopi: ఇందిరాగాంధీని “భారతమాత” అన్న వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వివరణ..
ఈ సందర్భంగా ప్రాజెక్టు ఎస్‌ఈ నరసింహమూర్తి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. శనివారం పోలవరం ప్రాజెక్టు అతిథి గృహం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులో స్పిల్‌వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యాం గ్యాప్ 3 పనులు పూర్తయ్యాయని, గ్యాప్ 1, 2 ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం పనులు పూర్తి చేయాల్సి ఉందన్నా రు. డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో నూతనంగా నిర్మించాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. డిజైన్స్ ఆమోదం కాగానే డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు. గ్రౌండ్ ఇంప్రూవ్ మెంట్, వైబ్రో కాంపాక్షన్ పనులు, అనంతరం ఎంబాక్‌మెంట్ పనులు, మెయిన్ డ్యాం పనులు చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి కేంద్ర సహకారం కూడా ఉండటంతో త్వరలో ప్రాజెక్టు పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.