Vizag Steel Plant: వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై దూకుడు.. స్ట్రాటజిక్ సేల్ తప్పదన్న కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Govt Focus On Vizag Steel Plant Privatization: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం దూకుడు పెంచింది. రాజకీయ పార్టీలు, స్టీల్ ప్లాంట్ కార్మికులు, రాష్ట్ర ప్రజలు ఈ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ముందుకే సాగాలని కేంద్రం నిర్ణయించింది. స్ట్రాటజిక్ సేల్ తప్పదని మరోసారి ప్రకటించింది. పెట్టుబడుల ఉపసంహరణ విధివిధానాలను ఖరారు చేస్తోంది. ప్రైవేటీకరణ అనివార్యమని దీపమ్ కార్యదర్శి తుహీన్ కాంత్ పాండే వెల్లడించారు. ఇప్పటికే లీగల్, ట్రాన్సక్షన్ అడ్వైజర్ల నియామకం కోసం బిడ్‌లు దాఖలయ్యాయి. విశాఖ ఉక్కు కొనుగోళ్ల రేసులో పలు దేశ, విదేశీ కంపెనీలు ఉన్నాయి. ఇంతవరకూ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యంతో సంప్రదింపులు చేసిన కేంద్రం.. ఇప్పుడు విశాఖ జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు సేకరిస్తోంది.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రైవేటీకరణ చర్యల అమలు తీరు ఎలా ఉంది? ప్రస్తుతం ఏం జరుగుతోంది? మేనేజ్‌మెంట్ ఎలాంటి చర్యలు అమలు చేస్తోంది? అనే విషయాలపై కేంద్ర ఉక్కు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆరా తీస్తోంది. మరోవైపు.. సెయిల్లో విలీనం దిశగా ప్రయత్నాలు చేయాలని రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు విశాఖ కార్మిక వర్గం పోరాడుతూనే ఉంది. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తమ ఆందోళనలను ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఈ పోరాటాన్ని ప్రారంభించి ఈనెల 27తో రెండేళ్లు కావొస్తున్న సందర్భంగా.. ఈ నెల 10న మానవ హక్కుల దినోత్సవం రోజున భారీ సదస్సు నిర్వహించాలని ఫిక్స్ అయ్యింది.
Also Read
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!