Uniform Marriage Age: ముస్లిం యువతుల వివాహానికి కనీస వయస్సును ఇతర మతాలకు చెందిన వారితో సమానంగా చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యూ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా కేంద్రం స్పందించాలని కోరింది. భారతదేశంలో వివాహానికి కనీస వయస్సు ప్రస్తుతం అమ్మాయిలకు 18, పురుషులకు 21 సంవత్సరాలు. అయినప్పటికీ ముస్లిం అమ్మాయిలకు కనీస వివాహ వయస్సు వారు యుక్తవయస్సు వచ్చినప్పుడే అనగా 15 సంవత్సరాలు ఆ వయస్సుగా భావించబడుతుంది. అమ్మాయి రజస్వల అయితే పెళ్లి చేసేయడానికి ముస్లిం మతాచారాలు అనుమతిస్తున్నాయని, ఇది పోస్కో చట్టానికి, ఐపీసీకి విరుద్ధమని మహిళా కమిషన్ పేర్కొంది. మతాలతో సంబంధం లేకుండా అమ్మాయిలకు 18 ఏళ్లు కనీస వివాహ వయసుగా నిర్ణయించాలని అభ్యర్థించింది.
యుక్తవయస్సులో (సుమారు 15 సంవత్సరాలు) ముస్లింలు వివాహం చేసుకోవడానికి అనుమతించడం ఏకపక్షం, అహేతుకం, వివక్షత, శిక్షా చట్టాలను ఉల్లంఘించడమేనని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కూడా 18 ఏళ్లలోపు వారికి శృంగారానికి సమ్మతించే అవకాశం లేదని పిటిషన్‌లో పేర్కొంది. ఇతర మతాలకు వర్తించే శిక్షా చట్టాలకు అనుగుణంగా ఇస్లామిక్ వ్యక్తిగత చట్టాన్ని తీసుకురావడానికి మైనర్ ముస్లిం మహిళల ప్రాథమిక హక్కుల అమలు కోసం పిల్ దాఖలు చేసినట్లు పేర్కొంది.
Himachal Pradesh: సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ప్రియాంకదే తుది నిర్ణయం!
అంతకుముందు 15 ఏళ్ల బాలికలు ముస్లిం ఇస్లామిక్ చట్టం ప్రకరాం తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. పంజాబ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది మరియు ఈ విషయంలో కోర్టుకు సహాయం చేయడానికి సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావును అమికస్ క్యూరీగా నియమించింది.18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను రక్షించడానికి ప్రత్యేకంగా అమలులో ఉన్న చట్టబద్ధమైన చట్టాలను సరిగ్గా అమలు చేయాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కోరింది.
పఠాన్‌కోట్‌కు చెందిన ముస్లిం దంపతులు తమ అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నందుకు తమ కుటుంబసభ్యులు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ తమకు రక్షణ కల్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. ముస్లిం ఆచారాల ప్రకారం తాము వివాహం చేసుకున్నామని బాలిక, 21 ఏళ్ల యువకుడు చెప్పారు. ముస్లిం యువతి వివాహాన్ని ముస్లిం పర్సనల్ లా నిర్వహిస్తుందని చట్టం స్పష్టంగా ఉందని పేర్కొంటూ హైకోర్టు ముస్లిం జంటకు రక్షణ కల్పించింది.