Supreme Court: లక్ష్మణరేఖ ఎక్కడుందో మాకూ తెలుసు.. నోట్ల రద్దును పరిశీలించాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయసమీక్ష పరిమితులకు సంబంధించిన లక్ష్మణరేఖ ఎక్కడుందో తమకు తెలుసని.. అయినా 2016లో ప్రధాని మోదీ సర్కారు ప్రకటించిన నోట్ల రద్దు అంశాన్ని పరిశీలించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై బుధవారం జస్టిస్ ఎస్.ఎ.నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. నోట్ల రద్దు వ్యర్థ ప్రయాసగా మిగిలిపోయిందా, ఏమైనా ప్రభావం చూపిందా అన్నదానిపై అన్ని అంశాలనూ కూలంకషంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తామని ధర్మాసనం వివరించింది. నోట్ల రద్దు అంశంపై సమగ్ర అఫిడవిట్లు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, భారత రిజర్వ్ బ్యాంకును ధర్మాసనం ఆదేశించింది.
Student Suicide: టీచర్‌ను ప్రేమించిన స్టూడెంట్.. ఆమెకు పెళ్లి కుదరడంతో సూసైడ్..
Also Read
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
- Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సరైన దృక్కోణంలో నుంచి పిటిషన్ సమర్పించకపోతే నోట్ల రద్దు అనేది ప్రస్తుత తరుణంలో కేవలం అకడమిక్ అధ్యయన అంశంగానే ఉంటుందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదించారు. ఇలాంటి అకడమిక్ అంశాలపై కోర్టు తన సమయం వృథా చేసుకోరాదని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. ఏ అంశమైనా రాజ్యాంగ ధర్మాసనం ముందుకొచ్చినప్పుడు పరిశీలించి తగిన సమాధానమివ్వడం తమ బాధ్యతని ధర్మాసనం పేర్కొంది. సమస్య అకడమిక్ పరిశోధనాంశంగా ఏమీ మారలేదని మరో పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది చిదంబరం అన్నారు. ఈ తరహా నోట్ల రద్దుకు పార్లమెంట్ ప్రత్యేక చట్టం చేయడం అవసరమని గుర్తుచేశారు. విచారణను ధర్మాసనం నవంబర్ 9కి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!