టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను మరో సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధం అయ్యిందంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి.. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే బిడ్లను ఆహ్వానించినా.. ఎక్కువ సంస్థలు మాత్రం పోటీ పడింది లేదు.. ఈ దశలో చివరి వరకు నిలిచింది మాత్రం టాటా గ్రూపే.. దీంతో.. టాటా గ్రూప్ చేతికి ఎయిరిండియా వెళ్లిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి.. ఎయిరిండియాని 68 ఏళ్ల తర్వాత ఆ సంస్థ అసలు యజమాని అయినట్టువంటి టాటా గ్రూప్ చేతికి వెళ్లిందనేది ఆ కథనం సారాశం.. అయితే, ఆ వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది..
టాటా గ్రూప్.. ఎయిరిండియాను తిరిగి సొంతం చేసుకుందన్న బ్లూమ్‌బర్గ్ కథనాన్ని తప్పుబట్టిన కేంద్రం.. ఆ వ్యవహారంలో వివరణ ఇచ్చింది.. ఎయిరిండియా పెట్టుబడుల ఉపసంహరణలో ఆర్థిక బిడ్లను ప్రభుత్వం ఆమోదించిందన్న వార్తల్లో వాస్తవం లేదని ఆర్థికశాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.. ఎయిరిండియా ప్రైవేటీకరణ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వెల్లడిస్తామని తెలిపింది. కాగా, ఎయిరిండియా సంస్థ కోసం డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది.. బిడ్లు వేసేందుకు నలుగురు మాత్రమే ముందుకు రాగా.. అందులో టాటా గ్రూప్ మాత్రమే చివరి దశవరకూ వెళ్లింది.. మరోవైపు 2018లో ఎయిరిండియాను అమ్మడానికి చేసిన ప్రయత్నాలు కూడా ముందుకు సాగలేదు.. ఇక, ఎయిరిండియా డిఇన్వెస్ట్‌మెంట్ విషయంలో భారత ప్రభుత్వం ఆర్థిక బిడ్‌ల ఆమోదాన్ని సూచించే వార్తలు తప్పు అని ఇన్వెస్ట్‌మెంట్ మరియు పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది.
Also Read
- UPI Charges: రూ.2,000 వరకు UPI పేమెంట్స్ ఫ్రీ.. RuPay డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్లకూ ఛార్జీలు లేవు
- Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
- Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
తాజావార్తలు
-
Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!