2021 సంవత్సరానికి క్రీడా రంగంలో అందించే ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున అవార్డులకు ఎంపికైన ఆటగాళ్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపిక కాగా 35 మందిని అర్జున అవార్డు వరించింది. ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన వారిలో టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా (జావెలిన్), మిథాలీ రాజ్ (క్రికెట్), రవి దహియా (రెజ్లింగ్), లవ్లీనా (బాక్సింగ్), అవని లేఖ (పారా షూటింగ్), సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్), శ్రీజేష్ (హాకీ), ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్), సుమీత్ ఆంటిల్ (అథ్లెటిక్స్), కృష్ణా నాగర్ (బ్యాడ్మింటన్), మనీష్ నర్వాల్ (షూటింగ్) ఉన్నారు.
Read Also: క్షమాపణలు చెప్పిన పాకిస్థాన్ మాజీ ఆటగాడు
మరోవైపు 35 మంది క్రీడాకారులు అర్జున అవార్డు కోసం సిఫారసు చేయబడ్డారు. ఈ జాబితాలో ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ ఉన్నాడు. అతడితో పాటు యోగేష్ కథునియా (డిస్క్ త్రో), నిషాద్ కుమార్ (హైజంప్), ప్రవీణ్ కుమార్ (హైజంప్), శరద్ కుమార్ (హైజంప్), ఎల్ వై సుహాస్ (బ్యాడ్మింటన్), సింగ్ రాజ్ అధానా (షూటింగ్), భవీనా పటేల్ (టేబుల్ టెన్నిస్), హర్వీందర్ సింగ్ (ఆర్చరీ) ఉన్నారు. కాగా టోక్యో ఒలింపిక్స్ సమయంలో పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ పతకం సాధించిన సందర్భంగా అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు లెజెండరీ హాకీ ఆటగాడు ధ్యాన్‌చంద్ పేరు పెట్టారు. దీంతో ఈ అవార్డును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుగా ప్రధాని మోదీ నామకరణం చేశారు.