పెగాసస్.. ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం ఇప్పుడు భారత్‌లో సంచలనంగా మారింది… ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండగా.. పార్లమెంట్ సమావేశాలను సైతం పెగాసస్ వ్యవహారం కుదిపేస్తోంది.. ఈ తరుణంలో.. సంచలన వ్యాఖ్యలు చేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ప్రజాస్వామ్య భారత్‌ను మోడీ సర్కారు నిఘా దేశంగా తయారు చేయాలనుకుంటోందని దుయ్యబట్టిన ఆమె.. పెగాసస్‌కు భయపడి తన ఫోన్‌కు ప్లాస్టర్ వేసుకున్నానని తెలిపారు.. కేంద్ర ప్రభుత్వ విపరీత చర్యలకు కూడా ప్లాస్టర్…
పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జాతీయ గిరిజన కమిషన్… పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసంపై రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.. దీనిపై స్పందించిన కమిషన్.. 15 రోజుల్లో వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలి, లేకపోతే సమాన్లు జారీ చేస్తామని పేర్కొంది.. పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించకుండా తరలించడంపై స్పందించిన జాతీయ గిరిజన కమిషన్.. ఈ మేరకు ఏపీ,…
కొడితే.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి.. లైఫ్ సెటిల్ ఐపోతుందని ప్రతీ నిరుద్యోగి కల. భాష కారణంగా కలను నిజం చేసుకోలేకపోతున్నారు నిరుద్యోగులు. పోటీ పరీక్షలన్నీ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటున్నాయి. తెలుగు, తమిల్, మళయాలం, కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లోనే విద్యాభ్యాసం చేసిన అభ్యర్థులకు పరీక్షలను ఎదుర్కోలేకపోతున్నారు. ఇంగ్లీష్, హిందీ మాదిరిగానే… ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్షలను నిర్వహించాలని మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ను కోరారు. ఆంగ్లేతర మాధ్యమంలో చదివిన వారు, హిందీయేతర రాష్ట్రాల…
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలను తెలుగు లాంటి ఇతర భాషల్లోనూ నిర్వహించాలని తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కి ఒక లేఖ రాశారు. కేంద్ర సర్వీసులు మరియు ఇతర శాఖలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఉద్యోగాల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నిర్వహించే…
కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై టీఆర్ఎస్ నాయకులు అవగాహన లేకుండా ఏవేవో మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ విమర్శించారు. ఇన్నాళ్లుగా కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జగన్‌తో కుమ్మక్కైన కేసీఆర్ దక్షిణ తెలంగాణను విస్మరించారని ఆమె ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను కేఆర్ఎంబీ నిలిపేస్తుందని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న…
కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 66-A ఐటీ చట్టం కింద నమోదైన కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని నాలుగేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.. రద్దు చేసినా కొన్ని రాష్ట్రాలు ఈ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర కంటెంట్‌ను పోస్ట్ చేసిన వారిని సెక్షన్ 66-A కింద…
2019 ఆగష్టులో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రాష్ట్ర హోదాను రద్దుచేసి లడక్‌ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత మొదటి జాతీయ స్థాయి రాజకీయ చర్చ జరిగింది. ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ ఒమర్ అబ్దుల్లాలు, గులాం నబీ ఆజాద్, మెహబూబా ముఫ్తిలతో పాటు బిజెపి నేత రవీంద్రరైనా నిర్మల్ సింగ్, సిపిఎం నాయకుడు ఎంఎల్ఎ యూసప్ తరగామి, ఆప్…
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్రం మధ్య వార్ కొనసాగుతూనే ఉంది… ప్రధాని పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో మ్యాటర్ మరింత సీరియస్ అయ్యింది.. దీంతో.. వెంటనే ఢిల్లీలో రిపోర్ట్ చేయాలంటూ అప్పటి సీఎస్ అలపన్ బందోపాధ్యాయకు కేంద్రం ఆదేశాలు పంపింది.. ఆ దేశాలను ఆయన పట్టించుకోలేదు.. ఇక, ఆయనను సీఎస్ పదవికి రాజీనామా చేయించారు దీదీ.. అయితే, తాజాగా అలపన్ బందోపాధ్యాయపై అఖిల భారత సేవల (క్రమశిక్షణ, అపీల్) నిబంధనల ప్రకారం కఠిన…
టీవీ ఛానెళ్ల ప్రసారాల్లో ఇప్పటికీ ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.. అయితే, పౌరుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానెళ్ల కోసం చట్టపరమైన యంత్రాంగాన్ని రూపొందించింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నిబంధనలు, 1994 సవరణకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. టీవీ ఛానల్స్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాలపై ప్రేక్షకుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కేంద్రం పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ఈ మేరకు…