వ్యాక్సినేషన్ విషయంలో మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేటలో హై రిస్క్ పర్సన్స్ కి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.. వ్యాక్సిన్ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అనేరీతిలో కేంద్రం వ్యవహారం ఉందన్న ఆయన.. రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదని.. మరోవైపు…
సోషల్ మీడియాలో శాంతిభద్రతలను దెబ్బతీసే వారిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను స్వాగతించారు తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి. “సోషల్ మీడియాలో ఎవరెవరో ఏవేవో పోస్టులు పెట్టడం…. జనాన్ని భయభ్రాంతులకు గురిచేసి ఆందోళనలకు కారణం కావడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి తప్పుడు పోస్టుల మూలాలను కనిపెట్టి, దోషులను శిక్షించడం…. అదే సమయంలో సోషల్ మీడియా వినియోగదారుల వ్యక్తిగత వివరాల భద్రతకు భంగం వాటిల్లకుండా చూడటానికే కేంద్రం సోషల్ మీడియా కంపెనీలకు కొన్ని కొత్త నిబంధనలు…
ఓవైపు కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంటే.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలా మంది ఇప్పుడు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారు.. భారత్‌లో చాలా ప్రాంతాల్లో ఈ కేసులు వెలుగు చూస్తూ ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మొదలు.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కేసులు బయటపడ్డాయి.. దీంతో. అప్రమత్తమైన కేంద్రం.. కీలక నిర్ణయం తీసుకుంది.. బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా గుర్తించాలంటూ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఇక, బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించిన వెంటనే…
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో కరోనా పై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీశ్‌రావు అనంతరం మాట్లాడుతూ… దేశమంతా కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతుంటే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంపై మాత్రమే ప్రేమ కురిపిస్తున్నది. గుజరాత్ కి 1లక్షా 63వేల వ్యాక్సిన్లను పంపించగా, తెలంగాణకు కేవలం 21వేల వ్యాక్సిన్లనే పంపించింది అని తెలిపారు. తెలంగాణపై ఇంత చిన్నచూపు ఎందుకు, తెలంగాణ ఈ దేశంలో లేదా, తెలంగాణ ప్రజలవి ప్రాణాలు కావా అని అన్నారు. వ్యాక్సిన్ల విషయంలోనూ…