జమ్మూకాశ్మీర్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసెంబ్లీ సీట్ల పెంపుపై కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సాగుతోందని, అది జరగ్గానే ఎన్నికలు నిర్వహిస్తామని అమిత్ షా ప్రకటించారు. ఆయన ప్రకటన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పందించారు.
Read Also: వరదల్లో వెరైటీ పెళ్ళి.. ఎక్కడో తెలుసా?
జమ్మూ కాశ్మీర్ సహా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీ సీట్లు పెంచాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచాల్సిందేనని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఒకే దేశం, ఒకే చట్టం నినాదాన్ని తెలుగు రాష్ట్రాల్లోనూ వర్తింపజేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.