ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. 78 రోజుల వేతనం బోనస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండుగ పూట రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం… నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వాలని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయంతో రైల్వేలోని 11.56 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో.. ఉద్యోగులకు బోనస్‌తో పాటు రైల్వేకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయాల్.. ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తంగా.. దీపావళి పండుగ సమయంలో రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్రం.
అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల వేతనాలకు సమానమైన పీఎల్‌బీ చెల్లింపు కోసం రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రివర్గం ముందు ప్రతిపాదనను సమర్పించగా.. ఈరోజు కేబినెట్ ఆమోదించింది. రైల్వేలపై ఉన్న పీఎల్‌బీ మొత్తం దేశమంతటా విస్తరించి ఉన్న నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరినీ (ఆర్‌పీఎఫ్/ఆర్‌పీఎస్‌ఎఫ్ సిబ్బంది మినహా) కవర్ చేస్తుంది. కాగా, అర్హత కలిగిన రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లింపు ప్రతి ఏడాది దసరా సెలవులకు ముందు ఇస్తుంటారు. గత సంవత్సరం, భారత రైల్వే తన 11.58 లక్షల నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల వేతనంతో కూడిన బోనస్‌ని అందించింది.
Also Read
తాజావార్తలు
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!