Online Betting : బెట్టింగ్ ఆప్స్ పైన కేంద్రం కొరడా చూపిస్తుంది. సినీ ప్రముఖులు రాజకీయ నేతలు క్రికెటర్లు పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ కొరకు ప్రచారం చేస్తున్నారని కేంద్రం చెబుతుంది. బెట్టింగ్ యాప్స్ వెనకాల భారీ కుట్ర దాగి ఉందని కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా 700 పైసలుకు అధికారికంగా బెట్టింగ్ యాప్స్ నడుస్తున్నాయని ఇందులో 357 ఆప్స్ అనధికారికంగా వ్యాపార లాభాలు నిర్వహిస్తున్నాయని జీఎస్టీ ఇంటలిజెన్స్ శాఖకు గుర్తించింది. 357 ఆప్స్ యజమాన్యులు 200400 పైసలుకు బ్యాంకు అకౌంట్లను కలిగి ఉన్నారని వీటిలో దొంగ బ్యాంకు అకౌంట్ తీసుకొని వాటి ద్వారా వచ్చిన డబ్బుని విదేశాలకు మళ్లిస్తున్నారని చెప్పింది. 267 మ్యూల్ అకౌంట్స్ ని ఓపెన్ చేసి తద్వారా 160 కోట్ల రూపాయల పైచిలుకు నగతిని బెట్టింగ్ యాప్స్ కంపెనీలు వసూలు చేసిందని జిఎస్టి ఇంటెలిజెన్స్ శాఖ గుర్తించింది. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్కా మారిన బెట్టింగ్ యాప్స్ ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. 357 బెట్టింగ్ యాప్స్ పూర్తిగా అక్రమాలు చేస్తున్నాయని అనధికారికంగా లాభాలు నిర్వహిస్తూ తద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా విదేశాలకు మళ్లిస్తున్నారని పేర్కొంది. హవాలా మనీ రూపంలో ఈ డబ్బు మొత్తం విదేశాలకు చేరిపోతుందని కేంద్ర ఇంటెలిజెంట్ శాఖ గుర్తించి ఆ మెరకు వాటిని కార్యకలాపాలను నిలిపివేసింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఆఫ్‌షోర్ 357 ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసింది. ఇవి పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన 2,400 బ్యాంక్ ఖాతాలను డీజీజీఐ అటాచ్ చేసింది. ఈ ఖాతాలలోని డబ్బు చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నుంచి వచ్చిందని భావిస్తున్నారు.
ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలో పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి డీజీజీఐ ఈ చర్యలు తీసుకుంది. కస్టమర్లను మోసపూరిత కార్యకలాపాల నుంచి రక్షించడం, ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలో పారదర్శకత కోసం ఈ చర్యలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. చాలా కంపెనీలు జీఎస్టీ చెల్లించడం లేదని, ఫ్రాడ్ అకౌంట్ల ద్వారా డబ్బును దేశం దాటిస్తున్నాయని డీజీజీఐ పేర్కొందిపన్ను ఎగవేతను అరికట్టడానికి ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థలపై డీజీజీఐ కఠినంగా వ్యవహరిస్తోంది. చట్టవిరుద్ధమైన, ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ మనీ గేమింగ్ ఎంటీటీల 357 వెబ్‌సైట్‌లు, URLలను కేంద్రప్రభుత్వం బ్లాక్ చేసింది.
అక్రమంగా నిర్వహిస్తున్న 357 వెబ్‌సైట్లను డీజీజీఐ బ్లాక్ చేసింది. గేమింగ్ సంస్థలకు చెందిన 2,400 బ్యాంక్ ఖాతాలను బ్లాక్ , సీజ్ చేసింది. 126 కోట్లను డీజీజీఐ ఫ్రిజ్ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను వాడవద్దని ప్రజలకు డీజీజీఐ సూచించింది. గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో లింక్ చేయబడిన 166 మ్యూల్ ఖాతాలను డీజీజీఐ బ్లాక్ చేసింది. ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని, విచారణ కొనసాగుతోందని డీజీజీఐ వెల్లడించింది.. మరొకపు హైదరాబాదులో బెట్టింగ్ యాప్స్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు.. పంజాగుట్టలో 11మంది కేసులు నమోదు చేయగా మియాపూర్ లో 25 మంది సెలబ్రిటీల పైన కేసు నమోదు చేశారు.. సంబంధించి నటీనట్లు విచారణ ఎదుర్కొంటున్నారు. మరోవైపు కంపెనీ ప్రతినిధులను నిందితురుగా చేరుస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు బెట్టింగ్ యాప్స్ కంపెనీ ప్రతినిధులను చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. .