Ponnam Prabhakar : మహేశ్వర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
- మేము పథకాలను నిలిపివేయలేదని స్పష్టం
- ఆర్థిక వ్యవస్థ పటిష్ఠం – అప్పుల విషయంలో ప్రభుత్వం స్పష్టత
- రాష్ట్ర ఆదాయంపై కేంద్రం అణచివేత
- కేంద్రం సహకరించాలి – బీజేపీ వాగ్దానాలు తప్పుల తడకగా మారాయి : మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తెలంగాణ శాసన సభలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ విధానాలపై బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “మేము ఏ పథకాన్ని నిలిపివేయలేదని స్పష్టంగా చెప్పగలము. ప్రభుత్వం కొత్త ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు విద్యాబోధన సక్రమంగా అందించాలని సూచిస్తున్నాం” అని చెప్పారు.
“రాష్ట్రానికి అప్పులు ఉన్నాయనే విషయం మాకు తెలుసు. అయితే, ఆర్థిక వ్యవస్థీకరణ చేస్తున్నాం. తెలంగాణ ఆర్థికంగా ఎదిగిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనుభవం కలిగినది, పాత పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త పథకాలను కూడా అమలు చేస్తున్నాం” అని ఆయన వివరించారు.
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ, “కేంద్రం పెద్దన్న లాగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి. బీజేపీ నేతలు తులం బంగారం గురించి మాట్లాడుతున్నారు. 15 లక్షల రూపాయలు అందిస్తామని చెప్పారు, ఏమైపోయాయి? రైతులకు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ వారి కోసం ఉరి చట్టాలు తీసుకొచ్చారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు” అని దుయ్యబట్టారు.
“తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే నిధులను కేంద్రం తిరిగి ఇవ్వడం లేదు. పైగా, బాత్రూంలపై, రేషన్ షాపులపై బీజేపీ నేతల ఫోటోలు పెట్టాలని చెబుతున్నారు” అని మంత్రి మండిపడ్డారు. “రైతు రుణమాఫీపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం నిర్మల్ నియోజకవర్గంలో 23,906 మంది రైతులకు రూ.202.55 కోట్ల రుణ మాఫీ చేసింది. రెండు లక్షల లోపు రుణమాఫీ అమలు చేయడం ద్వారా రైతులకు మద్దతుగా నిలుస్తున్నాం. నిర్మల్‌కు వచ్చి దీనిపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమాన్ని ఒక్క అడుగు కూడా తగ్గించదని, అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీజేపీ అనవసర విమర్శలు చేయడం మానేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
Stock Markets: మరోమారు భారీ నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్
తాజావార్తలు
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..