మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ముస్లిం సమాజంలోని ఒక వర్గం దీనికి మద్దతు ఇస్తుండగా, మరొక వర్గం వ్యతిరేకంగా ఉంది. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్‌డీఏ, దాని మిత్రపక్షాలు ఐక్యంగా ఉండగా, ఇండియా బ్లాక్ దీనికి వ్యతిరేకంగా వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్‌లో ఈ వక్ఫ్ బిల్లుపై వాదనలు జరుగుతున్నాయి. పార్లమెంటులో చర్చకు ఎనిమిది గంటలు కేటాయించారు. ఇందులో ఎన్డీఏకి మొత్తం 4 గంటల 40 నిమిషాల…
వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది.. అంతేకాదు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తే కాల్పుల విరమణ కూడా చేస్తామని కేంద్ర కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.. ఇందుకు సంబంధించి కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది.. ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు..
Khammam Politics : రంజాన్ పర్వదిన సందర్భంగా ఖమ్మం నగరంలోని ఈద్గా మైదానంలో జరిగిన ప్రార్థన జరిగే కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి అవమానం ఎదురైంది. రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు ముందుగా వచ్చిన మాజీ మంత్రి అజయ్ కుమార్ ఈద్గా మైదానంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సంబంధించిన మైనార్టీ నాయకుడు ఒకరు ఈద్గాలోకి నాన్ ముస్లింలు ఎవరు రాకూడదని నిర్ణయం చేసుకున్నామని వారి కోసం సపరేట్‌గా వేరే వేదిక ఏర్పాటు…
MLC Kavitha : తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీల హక్కులు, రిజర్వేషన్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను ఆమోదించేందుకు కాంగ్రెస్, బీజేపీ…
సూర్యలంక బీచ్ కి మహర్దశ వచ్చేసింది.. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.. కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 క్రింద ఏపీలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్ల నిధులు విడుదలయ్యాయని వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్.. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని తెలిపారు.
KTR : తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని, బడ్జెట్లో రాష్ట్రానికి ప్రస్తావన కూడా లేకపోవడం బాధకరమని అన్నారు. కేంద్ర మంత్రులు వరుసగా రాష్ట్రానికి వస్తున్నా, బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆక్షేపించారు. కేంద్ర మంత్రుల పర్యటనలకు ఖర్చు చేయాల్సిన అవసరం రాష్ట్రానికి లేకపోయినా, ఆ ఖర్చును తెలంగాణ అభివృద్ధికి ఉపయోగించివుంటే మేలు జరిగేదని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ చేసిన “తల్లిని చంపి…
Online Betting : బెట్టింగ్ ఆప్స్ పైన కేంద్రం కొరడా చూపిస్తుంది. సినీ ప్రముఖులు రాజకీయ నేతలు క్రికెటర్లు పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ కొరకు ప్రచారం చేస్తున్నారని కేంద్రం చెబుతుంది. బెట్టింగ్ యాప్స్ వెనకాల భారీ కుట్ర దాగి ఉందని కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా 700 పైసలుకు అధికారికంగా బెట్టింగ్ యాప్స్ నడుస్తున్నాయని ఇందులో 357 ఆప్స్ అనధికారికంగా వ్యాపార లాభాలు నిర్వహిస్తున్నాయని జీఎస్టీ ఇంటలిజెన్స్ శాఖకు గుర్తించింది. 357 ఆప్స్…
Ponnam Prabhakar : తెలంగాణ శాసన సభలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ విధానాలపై బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “మేము ఏ పథకాన్ని నిలిపివేయలేదని స్పష్టంగా చెప్పగలము. ప్రభుత్వం కొత్త ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు విద్యాబోధన సక్రమంగా అందించాలని సూచిస్తున్నాం” అని చెప్పారు. “రాష్ట్రానికి అప్పులు ఉన్నాయనే విషయం…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఏఐఎమ్ఐఎమ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశాన్ని స్వాగతిస్తున్నాము. కేంద్రం పారదర్శకంగా లేదు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. RRR మంజూరు...మెట్రో మంజూరు కోసం ..బాపు ఘాట్ అభివృద్ధికి ... మూసి ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని అడిగారు.
కేంద్రంపై నటుడు కమల్హాసన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలను హిందీ రాష్ట్రాలుగా మార్చి.. బీజేపీ గెలవాలనుకుంటోందని కమల్ హాసన్ ఆరోపించారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలను బలవంతంగా హిందీ భాషగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.