ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ మంగళవారం నాడు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక సహాయమంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా జవాబు ఇచ్చారు. విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ ఇటీవల నీతి ఆయోగ్‌తో జరిపిన సమావేశంలో విజ్ఞప్తి చేసిన విషయం వాస్తవమేనని స్పష్టం చేశారు. ప్రత్యేక…
ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐటీ చట్టం 2021 ప్రకారం యాంటీ ఇండియా, పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలతో 20 యూట్యూబ్ ఛానళ్లు, రెండు వెబ్సైట్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఆయా యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లు పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సహాయంతో భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. Read Also: మహిళలకు రూ.వెయ్యి కోట్లు బదిలీ చేసిన ప్రధాని మోదీ…
మహిళాల వివాహా వయస్సును 18 నుంచి21 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన చట్ట సవరణకు సంబంధించిన , బాల్య వివాహా సవరణ బిల్లును కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఈ బిల్లు పై పలు విమర్శలు వస్తున్నాయి. మహిళల స్వేచ్ఛను హరించడమేనని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న వివాహా వయస్సును తగ్గించి పెంచడం మంచిది కాదని విపక్షాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా ఈ బిల్లును ఆమోదించాలని చూస్తున్నాయి. 18 ఏళ్లకే ఓటు…
యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తెలంగాణపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి మంత్రి ఈశ్వర్ హాజరయ్యారు. కరీంనగర్- రాయపట్నం రహదారిపై మంత్రి బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం మెయిన్ రోడ్డు నుంచి మల్లాపూర్ దాకా జరిగిన రైతుల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో యాసంగి దొడ్డు ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వకుండా…
సీనియర్ సిటిజన్లు బూస్టర్ డోస్ తీసుకునేందుకు అనుమతించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. ఒమైక్రాన్ వేరియంట్ కేసుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. బూస్టర్ డోసులిచ్చే ప్రక్రియను ప్రారంభించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఒక్కరోజే ఢిల్లీలో 107 కేసులు నమోదవడంతో .. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, ఆదివారం ఒక్కరోజే 100 కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు. అయితే ఇవి…
చేనేత వస్త్ర పరిశ్రమ పైన జనవరి 1, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే టెక్స్ టైల్ రంగం ముఖ్యంగా చేనేత రంగం గత రెండు ఏళ్లు గా కరోనా సంక్షోభం కారణంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నదని.. ఇలాంటి నేపథ్యంలో..…
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల అంశం ఇప్పుడిప్పుడే తేలేలా లేదు. ఓ వైపు యాసంగి సీజన్ ప్రారంభం అవుతుండటంతో రైతులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం వరి పంటను వేస్తే కొనమని ఇప్పటికే స్పష్టంగా తేల్చి చెప్పింది. దీంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.వానాకాలం ధాన్యం కొనుగోలు పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కాగా మరోసారి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తో అమితుతమీ తేల్చుకోవడానికి రాష్ర్టప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే మంత్రుల బృందం మరోసారి ఢిల్లీకి వెళ్లింది.…
దేశంలో లింగ నిష్పత్తిలో మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. గతంలో మగవారు ఎక్కువగా ఉండగా ఆడవారు తక్కువగా ఉండేవారు. అందుకే మగాళ్లకు పిల్ల దొరకడం లేదని మన పెద్దవాళ్లు కామెంట్ చేసేవాళ్లు. అయితే ఇప్పుడు దేశంలో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారని శనివారం నాడు లోక్‌సభలో కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. దేశంలో మహిళలు, పురుషుల నిష్పత్తి 1020: 1000గా ఉందని జాతీయ ఆరోగ్య సర్వేలో స్పష్టమైందని తెలిపారు. దేశంలో 1020 మంది మహిళలు ఉంటే……
అగ్ని ప్రైమ్ క్షిపణిని ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఈ మిస్సైల్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అగ్ని-పీ మిస్సైల్ కొత్త జనరేషన్‌కు చెందిన అడ్వాన్స్డ్ వేరియంట్. అగ్ని ప్రైమ్ క్యానిస్టర్ మిస్సైల్. దీని సామర్థ్యం 1000 నుంచి 2000 కిలోమీటర్ల దూరం. అగ్ని ప్రైమ్‌కు అణ్వాయుధాలు మోసుకువెళ్లే సామర్థ్యం ఉందని తెలిపారు. Read Also: చెన్నై-బెంగళూరు హైవేను దిగ్భంధించిన మహిళా కార్మికులు అగ్ని క్లాస్‌కు చెందిన ఈ మిస్సైల్‌లో అనేక కొత్త ఫీచర్లను…
ధాన్యం ఎగుమతిపై కేంద్రానికి ప్రణాళిక లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.ధాన్యం తీసుకోకుండా కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. Read Also: సోషల్‌మీడియా సాయంతో ఆర్టీసీ సమస్యలకు చెక్ ధాన్యం తీసుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం పై నెపం నెట్టివేయాలని కేంద్రం చూస్తోందని ఆయన…