ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ భయంతో అన్ని దేశాలు బూస్టర్ డోస్ పై చర్చను ప్రారంభించాయి. అభివృద్ధి చెందిన దేశాలలో బూస్టర్ డోస్‌ను వారి ప్రజలకు ఇస్తున్నాయి. అయితే దీనిపై డబ్ల్యూహెచ్‌ఓ అభ్యంతరం వ్యక్తం చేసింది. బూస్టర్ డోస్‌ల పేరుతో వ్యాక్సిన్ నిల్వలను అంటిపెట్టుకోవద్దని వాటి పేద దేశాలకు అందజేయాలని సూచించింది. అయితే మనదేశంలో బూస్టర్ డోస్‌పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో బూస్టర్ డోసుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ ప్యానెల్‌కు వెల్లడించినట్లు…
కరోనా మహమ్మారి వర్కింగ్ స్టైల్‌ను, విద్యావిధానాన్ని కూడా మార్చేసింది.. అంతా ఆన్‌లైన్‌కే పరిమితం అయ్యేలా చేసింది.. ఈ సమయంలో.. ఐటీ కంపెనీలతో పాటు.. చిన్న సంస్థలు కూడా కరోనా సమయంలో రిస్క్ ఎందుకంటూ.. తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశాయి.. కరోనా కేసులు తగ్గి కొంత సాధారణ పరిస్థితులు వచ్చినా.. ఐటీ కంపెనీలు ఇంకా వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగిస్తూనే ఉన్నాయి.. అయితే, ఆ పేరుతో కంపెనీలు ఉద్యోగులను పిండేస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి.. ఎలాగు ఇంటి…
ఏపీకి పోలవరం ప్రాజెక్టు అతి ముఖ్యమైనది అని అందరికీ తెలిసిన విషయమే. గత కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడం లేదు. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సోమవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు పూర్తిపై రాజ్యసభలో టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వకంగా సమాధానం…
నాగాలాండ్‌లో భద్రతా బలగాలు సాధారణ పౌరులపై కాల్పులు జరిపిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటన తీవ్రకలకలం రేపుతున్న నేపథ్యంలో రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఉగ్రవాదులనే అనుమానంతోనే భద్రతా బలగాలు ఈ కాల్పులు జరిపారని అమిత్ షా స్పష్టం చేశారు. ఆత్మరక్షణ కోసమే సైనికులు ఈ కాల్పులు జరిపారని అమిత్ షా తెలిపారు. నాగాలాండ్‌లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. Read Also: వైరల్ వీడియో: చిన్నారి ప్రాణాన్ని…
నాగాలాండ్‌లో తీవ్రవాదులు అనుకుని పౌరులపైకి భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్రకలకలం రేపుతున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ తగుచర్యలు చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని భారత సైన్యం కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది. ఈశాన్య రాష్ట్రాలలో పనిచేసే ఓ మేజర్ ఈ విచారణకు సారథ్యం వహిస్తారని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనలో గ్రామస్తుల మృతదేహాలను గుర్తించిన యువకులు… ఆవేశం చెంది…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది.. ఇప్పటికే భారత్‌లోనూ ఈ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి.. కరోనాపై విజయం సాధించాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని గుర్తించిన భారత్.. విస్తృస్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది.. రికార్డు స్థాయిలో 125 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసింది.. ఒమిక్రాన్ నేపథ్యంలో ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోనివారు వెంటనే తీసుకోవాలని సూచిస్తోంది. మరోవైపు కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ కోసం ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ…
మన దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా రోగుల సంఖ్య ఐదుకు చేరింది. ఒమిక్రాన్ విషయంలో అంతా జాగ్రత్తగా వుండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దేశంలోని ఐదుగురు ఒమిక్రాన్ రోగుల లక్షణాలను వైద్యులు పరిశీలించారు. ఢిల్లీలోని ఒమిక్రాన్ రోగికి గొంతు నొప్పి, బలహీనత, శరీర నొప్పి ఉన్నదని ఎల్‌ఎన్‌జేపీకి చెందిన డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. ఆ వ్యక్తికి ప్రధానమైన లక్షణాలు లేవని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని చెప్పారు.రెండో ఒమిక్రాన్ రోగి అయిన బెంగళూరు వైద్యుడిలో జ్వరం,…
తెలంగాణలో వరి ధాన్యం పై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తునే ఉంది. కేంద్రం, రాష్ర్టం ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటునే ఉన్నాయి. మొన్న ఈ మధ్య ఇదే విషయన్ని చర్చించడానికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తన బృందంలో ఢీల్లీ వెళ్లిన ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే రైతులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. అటు బీజేపీ నాయకుల మాటలు వినాలా..ఇటు ప్రభుత్వ మాటలు వినాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. తాజాగా మరోసారి…
రక్షణ రంగంలో ఉత్పత్తుల తయారీలో భారత్‌ను స్వయం సమృద్ధిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దీన్లో భాగంగానే సుమారు ఐదు లక్షల ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఉన్న కోర్వా ప్లాంట్‌లో ఈ ఆధునిక తుపాకులను తయారు చేయనున్నారు. 7.62 X 39mm క్యాలిబర్ కలిగిన ఏకే 203 రైఫిళ్లను.. ఇన్సాన్ రైఫిళ్ల స్థానంలో వాడనున్నారు. ఇన్సాన్ రైఫిళ్లను ఇండియాలో గత మూడు దశాబ్దాల నుంచి వాడుతున్నారు. ఏకే-203…
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయంటూ రైతులు, విపక్ష నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దాదాపు సంవత్సరం పాటు రైతులు దేశరాజధాని ఢిల్లీలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యం ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా శీతకాల పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను…