ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐటీ చట్టం 2021 ప్రకారం యాంటీ ఇండియా, పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలతో 20 యూట్యూబ్ ఛానళ్లు, రెండు వెబ్‌సైట్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఆయా యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్లు పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సహాయంతో భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Read Also: మహిళలకు రూ.వెయ్యి కోట్లు బదిలీ చేసిన ప్రధాని మోదీ
ఆయా ఛానళ్లు భారతదేశాన్ని దూషిస్తూ సర్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానళ్లలో ‘నయా పాకిస్థాన్’ పేరుతో ఒక ఛానల్ ఉందని… ఈ ఛానల్ 15 యూట్యూబ్ ఛానళ్లను నడుపుతూ అయోధ్య గురించి, కాశ్మీర్ అంశం గురించి, రైతుల చట్టాల గురించి ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేస్తోందని.. ఆ ఛానల్‌కు 2 మిలియన్‌ల సబ్‌స్క్రైబర్లు కూడా ఉన్నారని పేర్కొంది.