బీజేపీ ప్రభుత్వ అకృత్యాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది: కొప్పుల ఈశ్వర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ప్రభుత్వ అకృత్యాల పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థను అమ్మేయాలనే కుట్ర బీజేపీ చేస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి గొడ్డలిపెట్టులా సింగరేణి సంస్థను అమ్మేసే ప్రయత్నం చేస్తుందన్నారు. లాభాల్లో నడిచే సంస్థలను ప్రవేట్ పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేంద్రం నిర్ణయాన్ని సింగరేణి కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త బ్లాకులు తవ్వుకోవడాని పర్మిషన్ ఇవ్వకపోగా..ఉన్న బ్లాకులను ప్రైవేటు పరం చేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత బొగ్గు ఉత్పత్తి ,రవాణా రంగంలో సింగరేణి గణనీయమైన వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. కార్మిక, పారిశ్రామిక వ్యతిరేక విధానాలను ఎండగడతామని కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు పోరాడాలని మంత్రి సూచించారు.
సింగరేణి సంస్థను బొందపెట్టాలని కేంద్రం చూస్తోంది: బాల్క సుమన్
సింగరేణి ని బొంద పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని బాల్క సుమన్ ఆరోపించారు. సింగరేని కార్మికుల తరపున పోరాటం ఉధృతం చేస్తామన్నారు. సింగరేణిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని పలు మార్లు సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రికి లేఖ రాసిన స్పందన లేదన్నారు. మోడీ దోస్త్ లకు సింగరేణి సంస్థను అప్పగించే కుట్ర బీజేపీ చేస్తుందన్నారు. సింగరేణి ప్రైవేటు పరం అయితే వారసత్వ ఉద్యోగాలు కొనసాగిస్తారా..? అంటూ ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో సింగరేణి ప్రాంతంలో ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తాం. తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? టీఆర్ఎస్‌ను తిట్టడం తప్ప బీజేపీకి తెలంగాణ ప్రయోజనాలు పట్టవా అంటూ విమర్శించారు. బీజేపీ నేతల పై సింగరేణి కార్మికులు తిరగబడాలి, నిలదీయాలిన్నారు. పార్లమెంట్ సమవేశాల సందర్భంగా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని బాల్క సుమన్ పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!