Niti Aayog: కొత్త వైస్ ఛైర్మన్‌గా రాజీవ్ కుమార్ స్థానంలో సుమన్ బెరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ పదవి నుంచి రాజీవ్ కుమార్ వైదొలిగిన సంగతి తెలిసిన విషయమే. ఐదేళ్ల క్రితం నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా నియమితులైన రాజీవ్ కుమార్ శుక్రవారం రాజీనామా చేశారు. దీంతో రాజీవ్ కుమార్ స్థానంలో సుమన్ బెరీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాజీవ్ కుమార్ రాజీనామాను మంత్రివర్గం నియామకాల కమిటీ ఆమోదించిందని.. ఈ మేరకు ఆయన వారసుడిగా సుమన్ బెరీని నియమించినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. మే 1 నుంచి సుమన్ బెరీ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారని తెలిపింది.
సుమన్ బెరీ 2001 నుండి 2011 వరకు పదేళ్ల పాటు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి, స్టాటిస్టికల్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానానికి సంబంధించిన సాంకేతిక సలహా కమిటీలో కూడా సభ్యుడిగా చేసిన అనుభవం ఉంది. 2013లో లాభాపేక్షలేని పరిశోధన థింక్ ట్యాంక్ అయిన పహ్లే ఇండియా ఫౌండేషన్‌ను సుమన్ బెరీ స్థాపించారు. దీనికి 2017 వరకు ఆయన నాయకత్వం వహించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో కూడా రెండు పర్యాయాలు పనిచేశారు. కాగా ప్రస్తుత నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఈనెల 30న పూర్తిగా బాధ్యతల నుంచి వైదొలుగుతారని కేంద్రం వెల్లడించింది.
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?