తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న మాట పగటికలలా మిగిలిపోతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం లో ఎస్సీ వర్గీకరణ కోసం చేపట్టిన పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా మాదిగ జాతి మరో ఉద్యమానికి సిద్ధపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బిజెపి పెద్దలు ఎనిమిది సంవత్సరాలు అయినా…
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ పొందడం ప్రస్తుత మన విద్యా విధానం. మున్ముందు కోర్సు అవగానే కొలువులు సాధించేలా విద్యార్థులు సుశిక్షితులు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేలా భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా పీఎంశ్రీ పాఠశాలలను నెలకొల్పనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జాతీయ నూతన విద్యా విధానానికి ఈ పాఠశాలలు ప్రయోగశాలలుగా ఉపయోగపడతాయని ఆయన అభివర్ణించారు.…
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై గృహ వినియోగదారులకు ఇస్తున్న సబ్సిడీని తొలగించింది. ఇకపై గ్యాస్ సబ్సిడీని కేవలం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పొందిన లబ్ధిదారులకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో సామాన్యులు మార్కెట్ ధరకే గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కరోనా తర్వాత సామాన్యులకు అంతంత మాత్రంగానే గ్యాస్ సబ్సిడీ పడుతోంది. ఇప్పుడు పూర్తిగా ఎత్తివేయడంతో గ్యాస్ సిలిండర్…
వైద్య విద్యలో పీజీ చేసేందుకు నిర్వహించిన నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ 2022 ఫలితాలను విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈమేరకు నీట్ పీజీకి అర్హత సాధించిన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అయితే పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లోనే రికార్డుస్థాయిలో నీట్ పీజీ ఫలితాలు వెలువడ్డాయి. దీంతో నేషనల్ బోర్డ్ ఆఫ్ఎగ్జామినేషన్ఇన్ మెడికల్ సైన్సెస్‌ను(NBEMS) కేంద్ర మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ ప్రశంసించారు. Central Government: జనాభా నియంత్రణ…
దేశంలో జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త చట్టం తేనుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. దేశంలో రోజు రోజుకు జనాభా పెరిగిపోతుండటంతో అనేక సమస్యలు వస్తున్నాయి. జనాభా పెరుగుదలతో సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉంది. దీంతో జనాభా నియంత్రణపై ఎలా చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను మీడియా ప్రశ్నించింది.…
ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటన జారీ చేసింది. ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు ఇతరులతో షేర్ చేసుకునే సమయంలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే విధంగా మాస్క్డ్ జిరాక్స్ కాపీలు ఉండాలని తెలిపింది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆధార్ జిరాక్స్ కాపీలపై మాట మార్చింది. Smart Watches: ఈ స్మార్ట్ వాచ్ లు…
దేశంలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు దగ్ధమవ్వడం, మరణాలు కూడా సంభవించడంతో.. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ వాహనాల ప్రమాదాల వెనుక అసలు కారణాలేంటో వెలికి తీయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో, డీఆర్డీవో రంగంలోకి దిగింది. ఎక్కడైతే ప్రమాదాలు చోటు చేసుకున్నాయో, ఆ ప్రాంతాలకు వెళ్ళి కొన్ని సాక్ష్యాల్ని సేకరించింది. తొలుత ఎండాకాలం సీజన్ వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, అందులో వాస్తవం లేదని ప్రాథమిక విచారణలో భాగంగా డీఆర్డీవో…
భారత్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకులలో అతి పెద్ద సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ప్రస్తుతం ఎస్బీఐ కస్టమర్ల ఫోన్లకు ఓ ఫేక్ మెసేజ్ సర్క్యులేట్ అవుతోంది. మీ ఎస్బీఐ ఖాతాను బ్లాక్ చేశారని.. సంబంధిత వివరాలతో మళ్లీ మీ ఖాతాను పునరుద్ధరించుకోవాలని మెసేజ్‌తో పాటు ఓ లింకు కూడా దర్శనమిస్తోంది. ఈ మెసేజ్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఇది ఫేక్ మెసేజ్ అని.. ఈ మెసేజ్ పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర…
పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో గుడ్ న్యూస్ అందించింది. ప్లాస్టిక్, సిమెంట్, ముడి పదార్థాలపై సుంకం తగ్గించనున్నట్లు ఆర్ధిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సిమెంట్ లభ్యత మెరుగు పడటంతో పాటు మెరుగైన లాజిస్టిక్స్ ద్వారా సిమెంట్ ధరను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అంతేకాకుండా స్టీల్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించనున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా దేశంలో సిమెంట్, స్టీల్ కొరత తగ్గి ధరలు…
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంపై ప్రధాని మోదీ స్పందించారు. పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాలు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ పౌరులకు మరింత ఉపశమనం కలగడంతో పాటు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ప్రజలే మొదటి ప్రధాన్యత అని మోదీ వెల్లడించారు. దేశంలో ఉజ్వల యోజన పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు లాభపడుతున్నాయని…