దేశవ్యాప్తంగా ఉద్యోగం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్ అందించారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టబోతోంది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రధాని మోదీ ఆదేశించారు. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలలో మానవ వనరుల స్థితిగతులపై మంగళవారం నాడు ప్రధాని మోదీ సమీక్షించారు. ఈ మేరకు ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను మిషన్ మోడ్‌లో భర్తీ చేయాలని వివిధ శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ…
ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి ఎందరో ఆర్థికపరమైన సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. చేజేతులా వేలు, లక్షలు, కోట్లు కోల్పోతున్నారు. కొందరైతే.. అప్పులు చేసి మరీ బెట్టింగ్స్ వేసిన సందర్భాలున్నాయి. మరికొందరు ప్రాణాలే కోల్పోయారు. ఇలాంటి ఘటనలు ఈమధ్య కాలంలో తరచుగా వెలుగు చూస్తుండడంతో.. కేంద్రం సీరియస్ అయ్యింది. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించిన ప్రచార ప్రకటనలకు దూరంగా ఉండాల్సిందిగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు అడ్వైజరీ జారీ చేసింది. ఇటీవల ఆ మీడియాల్లో ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్ ప్రకటనలు…
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బెట్టింగ్, గ్యాబ్లింగ్‌లు చట్టరిత్యా నేరం. అయితే వాటిని ప్రోత్సహించడం వల్ల యువత తప్పుదారి పట్టడమే కాకుండా, సామాజిక ఆర్థిక ప్రమాదాలు తలెత్తే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఐ అండ్ మినిస్ట్రీ అడ్వైజరీ పేర్కొంది. అందుకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ మీడియా సంస్థలు సంబధిత యాడ్స్‌ను ప్రసారం చేయకూడదని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు థర్డ్ పార్టీ ఆన్లైన్…
గత మూడు వారాలుగా నిలకడగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 121.28 డాలర్లకు పెరిగింది. గత పదేళ్లలో బ్యారెల్ చమురు ధర రికార్డుస్థాయిలో ఇదే అత్యధికం. ముడిచమురు ధర పెరగడం వల్ల ప్రభుత్వ రంగ చమురు కంపెనీల లాభాలపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మే 21న కేంద్ర…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఐపీఎస్ అధికారులను కేటాయించింది. 2020 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఐపీఎస్‌కు ఎంపికైన మొత్తం 200 మందిలో తెలంగాణకు ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌కు ఐదుగురు చొప్పున కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 నవంబర్ నాటికి ఉన్న ఖాళీల ఆధారంగా ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్ అధికారుల్లో ఇద్దరు తెలంగాణ వారే ఉండటం విశేషం. తెలంగాణకు కేటాయించిన వారిలో అవినాష్ కుమార్(బీహార్),…
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్. కొనుగోళ్లు చేయకుండా కనీస మద్దతు ధర అంటే ఏం లాభం అని ప్రశ్నించారు. తెలంగాణ పచ్చగా ఉండటం చూసి కేంద్రం ఓర్వలేకపోతోందని విమర్శించారు. కావాలనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. 2020 ఏప్రిల్ నుంచి ఐదు కిలోల ఉచినత బియ్యం అందిస్తున్నామని..90 లక్షల కార్డుల్లో 53 లక్షల మందికి మాత్రమే బియ్యాన్ని అందించిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందరికి…
రైతులకు ఊరట కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు గానూ 17 పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2022-23 సీజన్ కు ఖరీఫ్ పంటల ఎంఎస్పీ ఆమోదించబడింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వరి మద్దతు ధరను క్వింటాలుకు రూ.100 పెంచగా… దీంతో క్వింటాలు వరి రూ.2040కి చేరనుంది. 2021-22 వరి ఎంఎస్పీ…
నీట్ పీజీ సీట్ల భర్తీలో భారత వైద్య మండలి వ్యవహరించిన సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా వైద్యుల కొరత ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది 1,456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై ఆగ్రహించింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రం కలిసి వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడింది. 2021-22 విద్యా సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లకు తదుపరి కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సీట్లను ఖాళీగా ఉంచి ఏం సాధించారని మెడికల్ కౌన్సెలింగ్…
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న మాట పగటికలలా మిగిలిపోతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం లో ఎస్సీ వర్గీకరణ కోసం చేపట్టిన పాదయాత్రలో భాగంగా మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా మాదిగ జాతి మరో ఉద్యమానికి సిద్ధపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బిజెపి పెద్దలు ఎనిమిది సంవత్సరాలు అయినా…
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్య శిక్షణ పొందడం ప్రస్తుత మన విద్యా విధానం. మున్ముందు కోర్సు అవగానే కొలువులు సాధించేలా విద్యార్థులు సుశిక్షితులు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేలా భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా పీఎంశ్రీ పాఠశాలలను నెలకొల్పనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జాతీయ నూతన విద్యా విధానానికి ఈ పాఠశాలలు ప్రయోగశాలలుగా ఉపయోగపడతాయని ఆయన అభివర్ణించారు.…