AP Special Status: కాంగ్రెస్, బీజేపీ సంయుక్త వైఫల్యాల వల్లే ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది అంటూ రాజ్యసభలో మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన విజయసాయి రెడ్డి.. ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, జనాభా ప్రాతిపదికపై బీసీలకు రిజర్వేషన్లు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు ,విశాఖ మెట్రో అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీశారు విజయసాయి…
Centre likely to hike dearness allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్రం. మరోసారి ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్(డీఏ) పెంచే అవకాశం ఉంది. త్వరలోనే మరో 4 శాతం డీఏను పెంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 38శాతం డీఏ ఉంది.
PM Modi To Distribute 71,000 Job Letters To New Recruits On Jan 20: ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన ఉద్యోగులకు ప్రధాని నరేంద్రమోదీ జాబ్ లెటర్స్ అందిచనున్నారు. జనవరి 20న దాదాపుగా 71,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందిచబోతున్నారు. ప్రధాని మంత్రి కార్యాలయం(పీఎంఓ) ప్రకారం.. ప్రధాని మోదీ వీడియో కాన్పరెన్స్ ద్వాారా ఉదయం 10.30 గంటలకు అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేస్తారని, కొత్తగా జాబులో చేరబోతున్న ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించింది.
Central Government: భర్తను భార్య రేప్ చేయడమేంటి.. భార్యను భర్త రేప్ చేయడమేంటి.. అసలు ఏంటి ఇదంతా.. సమాజం ఎటువెళ్తోంది.. టైటిల్ చూడగానే ప్రతి ఒక్కరి మనస్సులోనూ ఇవే అనుమానాలు వ్యతమవుతున్నాయి. ఒక మహిళకు ఇష్టం లేకుండా ఏ మగాడు.. ఆఖరికి భర్త కూడా ముట్టుకోవడానికి వీలు లేదు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని.. కాలం చాలా శక్తివంతమైనదన్నారు.
Ease Of Living: దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. నివాసానికి సౌకర్యంగా ఉండే పట్టణాల్లో దేశవ్యాప్తంగా టాప్-10లో ఏపీలోని మూడు పట్టణాలు స్థానం సంపాదించాయి. ఈ జాబితాలో గుంటూరు ఆరో స్థానం, విజయవాడ 8వ స్థానం, విశాఖపట్నం 9వ స్థానం దక్కించుకున్నాయి. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సిటిజన్ పర్సెప్షన్ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రజల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. ఈ ర్యాంకుల్లో థానే, బెంగళూరు, భోపాల్…
మత మార్పిడి అనేది తీవ్రమైన సమస్య అని.. అది రాజకీయ రంగు పులుముకోకూడని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరిత మత మార్పిడులను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని దాఖలైన పిటిషన్‌పై అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సహాయాన్ని సోమవారం న్యాయస్థానం కోరింది.
ఇప్పుడు అన్నింటికీ ఆధార్ నంబరే ఆధారం.. ఏ రిక్వెస్ట్ పెట్టాలన్నా ఆధార్ కార్డ్ కాపీని జత చేయాల్సిందే.. దీంతో, చాలా వరకు స్మార్ట్ ఆధార్ కార్డులను క్యారీ చేస్తున్నారు ప్రజలు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆధారు కార్డులను ఎక్కడపడితే అక్కడ జిరాక్స్ తీయించడం.. కొన్నిసార్లు సరిగారాలేదని వదిలేయడం.. మరికొన్నిసార్లు మర్చిపోవడం చేస్తూనే ఉన్నారు.. కొందరైతే.. తమ ఆధార్ వివరాలను సోషల్ మీడియాలోను పంచుకుంటున్నారు.. దీనిపై ఆధార్ కార్డు వినియోగదారులకు వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఆధార్‌కార్డు,…