Gidugu Rudra Raju : కేంద్ర, రాష్ట్ర సర్కార్ లపై ఏపీసీసీ చీఫ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల రోజులుగా దేశ వ్యాపితంగా జై భారత్ సత్యాగ్రహ సభలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించామని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఆదాని యొక్క అక్రమ ఆస్తులపై పార్లమెంట్ రాహుల్ గాంధీ ప్రసంగాలను లోక్ సభ రికార్డుల నుంచి తొలగించారు.. దేశ సమస్యలపై ప్రసంగాలని తొలగించిన పరిస్థితి చరిత్రలో ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు లేదని ఆయన అన్నారు. గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా రాహుల్ గాంధీ దేశంలోని అనేక సమస్యలపై మాట్లాడుతున్నారు..
అనేక ప్రాంతాల్లో ముస్లింలను కించపరుస్తు దాడులు జరిగాయి.. క్రిస్టియన్ల సంస్థలపై దాడులు జరిగాయి.. అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.
Also Read : Salman Khan: సార్ మిమ్మల్ని ఎవరో మోసం చేశారు…
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ప్రధానిగా ఉన్న జవహార్ లాల్ నేహ్రు నుంచి ఇతర ప్రధానులు ఎన్నో సంక్షేమ పధకాలు, ప్రాజెక్టులు తీసుకు వచ్చారు.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోడీ ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టార అంటూ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాని రద్దు చేసి ఇంటిని ఖాళీ చేయించిన ఘటన భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని కదలించింది.. ఇది అత్యంత దురదృష్టకరమైన చర్య అంటూ రుద్రరాజు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గాంధీ కుటుంబాని కావాలని టార్గెట్ చేసి సీబీఐతో దాడులు చేయించారు. ఫలితం లేకపోవటంతో రాహుల్ గాంధీ ఇంటిని సైతం ఖాళీ చేయించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Rajastan : మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 12మంది చిన్నారులను కాపాడిన రెస్క్యూ టీం
రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీఎం జగన్, ప్రతిపక్షంలో చంద్రబాబు, బీజేపీతో ఉన్న పవన్ కల్యాణ్ ప్రస్తుత పరిణామాలపై కనీసం స్పందించడం లేదని ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శలు గుప్పించారు. రేపు గాంధీనగర్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తాం.. ఈ సభకు ముఖ్య అతిథిలుగా రంజిత రంజన్, క్రిస్టోఫర్ తిలక్, మయ్యపన్, జేడీ శీలం, కొప్పలరాజు, చింతామోహన్, పల్లంరాజు ఇతర అగ్రనేతలు హాజరవుతారు అని ఆయన వెల్లడించారు. రేపు జరగబోయే ఈ బహిరంగ సభ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియపరుస్తామని ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!