దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రీమియం బాస్మతీ బియ్యం ముసుగులో తెలుపు బాస్మతీయేతర బియ్యం 'అక్రమ' ఎగుమతిని ఆపడానికి కేంద్రం కట్టడి చర్యలు ప్రారంభించింది.
Increase Retirement Age: ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల విషయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల పదవీకాలన్నీ మరో రెండు సంవత్సరాలు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పీఎస్‌బీల మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ కాలం 60 సంవత్సరాలుగా ఉంది. అయితే వీరి రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందట. దేశంలో ద్రవ్యోల్భణం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి గురించి, అభివృద్ధి గురించి…
గత ఎనిమిదేళ్లలో జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాల సంఖ్య 15 కోట్ల నుంచి 50 కోట్లకు పెరిగింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) తొమ్మిదేళ్ల క్రితం ఆగస్టు 28, 2014న ఆర్థిక చేరిక లక్ష్యంతో ప్రారంభించబడింది.
EPFO: రిటైర్మెంట్ బాడీ ఫండ్ ఈపీఎఫ్‌వో జూన్ 2023లో 17.89 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. కార్మిక మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెలలో ఈసీఆర్లను 3,491 సంస్థలు తమ ఉద్యోగులకు ఈపీఎఫ్వోద్వారా సామాజిక భద్రతను పొడిగించాయని పేర్కొంది.
వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్‌కు కేంద్రం రూ.200 కోట్లు మంజూరు చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌కు ముందస్తు సహాయంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రూ.200 కోట్లను విడుదల చేయడానికి కేంద్రం ఆదివారం ఆమోదం తెలిపింది.
నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA).. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన "పీఎం విశ్వకర్మ"కు ఆమోదం తెలిపింది. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి ప్రకటించిన ఈ పథకం ద్వారా 30 లక్షల మంది హస్తకళాకారులు, వారి కుటుంబాలకు రాయితీపై వడ్డీ రేటుతో పూచీకత్తు రహిత రుణాలను అందించడం ద్వారా ప్రయోజనం అందిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
ప్రభుత్వం ఉద్యోగులకు కేంద్రం ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తున్న విషయం తెలిసిందే..డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సొనెల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) తాజాగా కీలకమైన స్పష్టత ఇచ్చింది.. ఎల్టీసీకి సంబంధించిన కొత్త రూల్స్ అంశంపై క్లారిటీ తీసుకువచ్చింది. ఎల్టీసీ కింద ట్రైన్ జర్నీ, ఎల్టీసీకి సంబంధించి ఎయిర్ టికెట్లు బుకింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. 7వ వేతన సంఘం కింద జీతం తీసుకుంటున్న ఉద్యోగులకు ఈ రూల్స్ వర్తిస్తాయి.. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1988 కింద…
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 954 మంది పోలీసులకు పోలీస్ సేవా పతకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 229 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 642 మందికి పోలీసు సేవా పతకాలు అందించనుంది. ఇక, తెలంగాణ రాష్ట్రం నుంచి 34 మంది ఎంపిక అయ్యారు.
ఆఫ్రికన్ దేశమైన నైజర్‌లోని భారతీయ పౌరులను వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అక్కడి పరిస్థితులను వివరిస్తూ వీలైనంత త్వరగా నైజర్ వదిలి వెళ్లాలని భారత ప్రభుత్వం ఆగస్టు 11న భారతీయ పౌరులందరికీ సూచించింది.