మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఇవాళ ఎంపీ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించనుంది సీబీఐ. ఇవాళ్టి నుంచి ఆరురోజులపాటు విచారించనుంది. ఈనెల 24 వరకు ఆయన్ని ప్రశ్నించనుంది సీబీఐ టీమ్.. అయితే, ఈ నెల 25 వరకు అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐని ఆదేశించింది ఇప్పటికే తెలంగాణ హైకోర్టు. అప్పటి వరకు ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అవినాష్ రెడ్డి విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని తెల్పింది. విచారణ సమయంలో ప్రశ్నలను లిఖితపూర్వకంగానే…
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగిచింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు సోమవారం ఏప్రిల్ 17 వరకు పొడిగించింది.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం నాడు తన కార్యాలయంపై సీబీఐ దాడిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. మొత్తం సీబీఐ కసరత్తు దురుద్దేశపూరిత చర్యగా అభివర్ణించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ చేపట్టింది. కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ విషయాలు వెలుగులోకి వచ్చిన అనంతరం రాష్ట్ర పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి సీబీఐ కేసును స్వీకరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరోసారి దాడులు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వ్యక్తిగత సహాయకుడి ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. అతడిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. 'ఆపరేషన్' గరుడ పేరుతో దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల సరఫరాలపై సోదాలు చేపట్టింది. ఇంటర్‌పోల్, ఎన్సీపీతో పాటు రాష్ట్రాల పోలీసులతో కలిసి సీబీఐ 'ఆపరేషన్ గరుడ'ను చేపట్టింది.
హర్యానాలోని హిసార్ జిల్లాలో ఖాప్ మహాపంచాయత్ జరిగిన మరుసటి రోజు బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ హత్యపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తును కోరుతూ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ హత్య కేసును కేంద్ర ఏజెన్సీకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.
తనను తప్పుడు ఎక్సైజ్ కేసులో ఇరికించాలని ఒత్తిడి తెచ్చినందుకే సీబీఐ అధికారి ఆత్మహత్య చేసుకున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారం పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరచాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారని ఆయన ఆరోపించారు.