Manish Sisodia: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం నాడు తన కార్యాలయంపై సీబీఐ దాడిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. మొత్తం సీబీఐ కసరత్తు దురుద్దేశపూరిత చర్యగా అభివర్ణించారు. రెండో శనివారం (అధికారిక సెలవుదినం) నాడు సీబీఐ తన కార్యాలయంపై దాడి చేసి, సమావేశ మందిరంలోని కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకోవాలని కార్యదర్శికి చేతితో రాతపూర్వకంగా నోటీసు ఇచ్చిందని వివరిస్తూ.. ఈ కసరత్తు దురుద్దేశపూరిత చర్యగా డిప్యూటీ సీఎం తన ప్రకటనలో పేర్కొన్నారు. హాష్ వాల్యూ ఇవ్వకుండా కంప్యూటర్‌ను సీజ్ చేసి, నన్ను దురుద్దేశపూర్వకంగా ఇరికించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
Drugs Seized : మాత్రల రూపంలో రూ.కోట్లు విలువ చేసే డ్రగ్స్.. సీజ్ చేసిన అధికారులు
నోటీసు ప్రకారం, తన కాన్ఫరెన్స్ రూమ్‌లో ఇన్‌స్టాల్ చేసిన సిస్టమ్ సీపీయూను ఇవ్వాల్సిందిగా సెక్రటరీని అభ్యర్థించారన్నారు. తర్వాత నిర్దేశించబడిన విధివిధానాలను పాటించకుండా తన కార్యాలయంలోని సమావేశ మందిరం నుండి సీపీయూను స్వాధీనం చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. ‘హాష్ వాల్యూ’ ఇవ్వకుండానే సీబీఐ కంప్యూటర్‌ను సీజ్ చేసిందని సిసోడియా తెలిపారు. జప్తు సమయంలో “హాష్ విలువ” రికార్డింగ్ లేనప్పుడు, సీబీఐ తన సౌలభ్యం మేరకు స్వాధీనం చేసుకున్న సీపీయూలోని రికార్డును మార్చుకోవచ్చని ఆయన చెప్పారు. సీబీఐ తన సౌలభ్యం ప్రకారం స్వాధీనం చేసుకున్న సీపీయూలోని రికార్డును మార్చి దురుద్దేశపూర్వకంగా నన్ను ఇరికించడానికి ప్రయత్నించవచ్చని మనీష్ సిసోడియా అన్నారు.